Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-May-2016 15:23:52
facebook Twitter Googleplus
Photo

ఇక తెలుగు - తమిళం - మలయాళంలలో కూడా ''జనతా గ్యారేజ్'' అనే టైటిల్ ను పెడుతున్నట్లు ఆల్రెడీ మేకర్లు మనకు కన్ఫామ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మలయాళం వర్షెన్ పోస్టర్ ను ఈరోజు విడుదల చేశారు. ఇక్కడే ఒక ట్విస్టుంది.

నిన్న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కాబట్టి.. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను తెలుగులో విడుదల చేశారు. అయితే ఇవాళ మోహన్ లాల్ పుట్టినరోజు కాబట్టి.. మలయాళంలో ఆయన ఫస్టు లుక్ ను విడుదల చేశారు. కాకపోతే జనతా గ్యారేజ్ అంటూ మోహన్ లాల్.. ఆయన తమ్ముళ్లగా నటిస్తున్న తమిళ నటుడు రెహ్మాన్.. తెలుగు నటుడు బ్రహ్మాజీలతో కూడిన ఫోటోనే విడుదల చేశారు కాని.. మనోళ్ళు ఎన్టీఆర్ స్టిల్ మాత్రం విడుదల చేయలేదు. సినిమాలో మోహన్ లాల్ తమ్ముడు రెహ్మాన్ కొడుకుగా ఎన్టీఆర్ కనిపిస్తాడని టాక్.

సర్లేండి.. బిజినెస్ పాయింటాఫ్ వ్యూ లో చూసి.. అక్కడ మోహన్ లాల్ పోస్టర్ ను మాత్రమే విడుదల చేసుంటారు. ఆ విధంగా అక్కడ సినిమాను రిలీజ్ చేసి.. అప్పుడు ఎన్టీఆర్ కు మార్కెట్ క్రియేట్ చేస్తారేమో.

,  ,  ,  ,  ,  ,  ,