Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Apr-2017 10:34:59
facebook Twitter Googleplus
Photo

మహాభారతం.. రాజమౌళి కలల సినిమా. ఎప్పటికైనా భారతీయ వెండితెరపై ఎవ్వరూ చూపించని విధంగా మహాభారతాన్ని ఆవిష్కరించాలని కలలు కంటున్నాడు రాజమౌళి. ఐతే ఈ సినిమా ఎప్పుడు అని అడిగితే మాత్రం.. నాకింకా అనుభవం రాలేదు.. పదేళ్ల తర్వాత చూద్దాం అంటున్నాడు జక్కన్న. గత కొన్నేళ్లుగా ఇదే మాట అంటున్నాడు. ఈ మధ్య కూడా అదే చెప్పాడు. ఐతే జక్కన్న ఈ మాటలు చెబుతుండగానే.. మరోవైపు వేరే మహాభారతాలకు రంగం సిద్ధమైపోతోంది. షారుఖ్ ఖాన్ ఓ విదేశీ సంస్థతో కలిసి మహాభారతం సినిమా తీసే ఆలోచన చేస్తుండగా.. ఈలోపే యూఈఏకి చెందిన ఓ మల్టీ నేషనల్ కంపెనీ వచ్చే ఏడాదే ఈ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తోంది.

రూ.1000 కోట్లతో మహాభారతం సినిమాను తెరకెక్కించనున్నట్లు నిర్మాత బీఆర్ శెట్టి అధికారికంగా ప్రకటించడం విశేషం. ఈ చిత్రాన్ని 2018 సెప్టెంబర్లో మొదలుపెడతారట. రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ చిత్రం 2020లో విడుదలవుతుంది. 90 రోజుల వ్యవధిలో రెండు సినిమాలూ విడుదలవుతాయి. శ్రీకుమార్ మీనన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడు. భీష్ముడి దృక్కోణంలో మహాభారతం ఆధారంగా రండమూలం అనే నవల రాసిన వాసుదేవ్ మీనన్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చనున్నాడు. భారతీయ ప్రముఖ నటీనటులతో పాటు కొందరు హాలీవుడ్ యాక్టర్స్ ను కూడా ఈ సినిమాలో నటింపజేస్తారట. హాలీవుడ్ టెక్నీషియన్లు ఈ సినిమాకు పని చేస్తారట. హిందీ.. తమిళం.. మలయాళం.. తెలుగు.. ఇంగ్లిష్ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రం పలు భారతీయ భాషల్లోనూ అనువాదమవుతుందని వెల్లడించారు.

,  ,  ,  ,  ,