Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Jul-2017 10:52:54
facebook Twitter Googleplus
Photo

హీరోలు సినిమాల్లో ఉంటారు. కానీ రియల్ హీరోలు మాత్రం నిజ జీవితంలోనే ఉంటారు. మరి సూపర్ హీరోలు ఎక్కడుంటారు? హాలీవుడ్ లో అనే సమాధానం చెప్పడం తేలికే కానీ.. అక్కినేని నాగార్జున మాత్రం అందరూ సూపర్ హీరోలుగా మారిపోవచ్చని అంటున్నాడు. అందుకోసం ఏం చేయాలో కూడా చెప్పేశాడు.

టాలీవుడ్ స్టార్ హీరో అయిన నాగార్జున.. ఇప్పుడు అవయవ దానంపై ప్రచారం చేస్తున్నారు. రీసెంట్ గా ఓ ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ప్రతీ ఒక్కరూ అవయవ దానంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రజలనందరూ ఆర్గాన్ డొనేషన్ చేయాలనే ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది జీవితాల్లో ఇది వెలుగులు నింపుతుంది. దీనిపై అవగాహన లేకపోవడంతో పాటు.. మూఢ నమ్మకాల కారణంగా పలువురు ఇందుకు ముందుకు రావడం లేదు. అవయవదానం చేసి సూపర్ హీరోలుగా పలువురికి జీవితాన్ని ఇచ్చి.. సూపర్ హీరోలుగా మారండి అంటూ తన అభిమానులతో పాటు ప్రజలందరికీ పిలుపునిచ్చారు నాగ్.

ఈ కార్యక్రమంలో కళా తపస్వి కె. విశ్వనాథ్ తో పాటు.. బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు కూడా పాల్గొంది.

,  ,  ,  ,  ,  ,