Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Apr-2015 10:27:21
facebook Twitter Googleplus
Photo

ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించడంలో కథ..కథనాలు ప్రధానమైన పాత్రను పోషిస్తుంటాయి. ఇక వాళ్లని ఊహాలోకంలోకి తీసుకెళ్లి అందమైన అనుభూతిని అందజేసే బాధ్యతను పాటలు తీసుకుంటాయి. అందుకే పాటలకి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తుంటారు .. వాటిని ప్రత్యేకంగా ఆవిష్కరిస్తూ పండుగ చేస్తుంటారు. అలా త్వరలో పాటల సందడి చేయనున్న చిత్రంగా 'మోసగాళ్లకి మోసగాడు' కనిపిస్తుంది. ఈ సినిమాలోని పాటలను ఈ నెల 26న విడుదల చేయనున్నట్టు దర్శక నిర్మాతలు ప్రకటించారు.

సుధీర్ బాబు .. నందిత నాయకా నాయికలుగా కనిపించనున్న ఈ సినిమా, టైటిల్ తోనే ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించింది. గతంలో కృష్ణ కథానాయకుడిగా ఘనవిజయాన్ని సాధించిన 'మోసగాళ్లకు మోసగాడు'కీ, ఈ సినిమాకి గల సంబంధమేమిటనే కుతూహలం పెరిగింది. ఈ రెండు సినిమాల మధ్య ఎలాంటి పోలికలేదనీ, క్రైమ్ .. కామెడీ కలగలిసిన వినోదాత్మక చిత్రమని దర్శక నిర్మాతలు చెప్పారు. ఈ నెల 26 న పాటల వేడుక జరుపుకుని, మే 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుందనే విషయాన్ని స్పష్టం చేశారు.

,  ,  ,  ,  ,