Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Sep-2017 16:08:58
facebook Twitter Googleplus
Photo

స్పైడర్ మూవీపై ఇప్పుడు చాలానే ఆసక్తి నెలకొంది. ఓ టాలీవుడ్ స్టార్ హీరో.. తమిళ్ లో మార్కెట్ కోసం సిన్సియర్ గా చేస్తున్న మొదటి ప్రయత్నం దాదాపుగా ఇదే. అందుకే ఇండస్ట్రీ జనాలు కూడా స్పైడర్ వైపు ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పుడీ స్పైడర్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ హల్ చల్ చేస్తోంది.

ఈ సినిమాలో ఒక్కటంటే ఒక్కటి కూడా సిగరెట్.. మందు.. సీన్ ఉండదట. అంటే.. సినిమాలో ఏ పాత్ర కూడా బ్యాడ్ హ్యాబిట్స్ కలిగి ఉండదని అన్నమాట. విలన్స్ చాలామందే ఉన్నా.. వారెవరికీ చెడు అలవాట్లు లేకుండా చూపించడం అనే విషయం చాలా పెద్ద రిస్క్. నిజానికి ఇలాంటి హ్యాబిట్స్ ను ప్రోత్సహించకూడదని.. సినిమాలో చూపించే అంశాలు జనాలపై ఎఫెక్ట్ చూపిస్తాయని దర్శకుడు మురుగదాస్ బలంగా విశ్వసిస్తాడు. అందుకే తన విలన్స్ ని డిఫెరెంట్ గా చూపిస్తుంటాడు. మెగాస్టార్ కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150కి మాతృక అయిన తమిళ్ మూవీ కత్తి మురుగదాస్ తీసినదే.

ఈ కత్తి చిత్రంలో మెయిన్ విలన్ గ్రీన్ టీ తాగుతూ కనిపిస్తాడంతే. హెల్దీ హ్యాబిట్స్ తో పవర్ ఫుల్ విలనిజం అన్న మాట. ఇప్పుడు స్పైడర్ లో కూడా విలన్ పాత్ర పలుమార్లు గ్రీన్ టీ తాగుతూ కనిపిస్తుందని తెలుస్తోంది. కమర్షియల్ సినిమాలు.. వాటిలో ఇన్ డెప్త్ గా మెసేజ్ ఉండే మూవీస్ తీయడమే కాదు.. సిగరెట్.. మందు లాంటి అలవాట్లను ప్రోత్సహించకూడదని.. మడి కట్టుకున్న మురుగదాస్ కమిట్మెంట్ ను అభినందించాల్సిందే

,  ,  ,  ,  ,