Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Apr-2016 11:37:24
facebook Twitter Googleplus
Photo

అమెరికన్ సింగర్ కం సాంగ్ రైటర్ అయిన ప్రిన్స్.. హఠాత్తుగా మరణించాడు. 57 సంవత్సరాల వయసున్న ప్రిన్స్.. 1976 నుంచి సంగీత లోకంతో అనుబంధం పంచుకున్న ప్రతిభావంతుడు. 40 ఏళ్లుగా ఈయనకు మ్యూజిక్ ప్రపంచంతో ఎనలేని అనుబంధం ఉంది. ఓ ఎలివేటర్ లో చలనం లేని స్థితిలో ఉన్న ప్రిన్స్ ను హాస్పిటల్ కు చేర్చగా.. మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు.

ప్రిన్స్ మరణంపై బాలీవుడ్ తారలంతా నివాళి ప్రకటిస్తున్నారు. షారూక్ ఖాన్ - ప్రియాంక చోప్రా - మాధురీ దీక్షిత్ - అభిషేక్ బచ్చన్ - వరుణ్ ధావన్ - మనీష్ మల్హోత్రా.. ఇలా ప్రతీ ఒక్కరూ తమ స్పందనను ట్విట్టర్ ద్వారా తెలియచేస్తున్నారు. ఈ ప్రపంచాన్ని గెలుచుకున్నావ్ అంటూ ప్రియాంక ట్వీట్ చేస్తే.. కొన్ని తరాలకు సరిపడే స్ఫూర్తినిచ్చావ్ అంటూ మాధురీ దీక్షిత్ ట్వీట్ చేసింది. ప్రిన్స్ అందిచిన వాటిటలో పర్పుల్ రెయిన్ సాంగ్.. తమ ఫ్యావరేట్ ఆల్బం అంటూ.. బాలీవుడ్ లో చాలామంది చెబుతున్నారు.

గతవారంలో ప్రిన్స్ ఓ విమాన ప్రయాణం చేస్తున్నపుడు.. ఆ ఫ్లైట్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి ప్రిన్స్ అనారోగ్యాన్ని ఎదుర్కుంటున్నాడని.. అదే ఇప్పుడు ప్రిన్స్ మరణానికి దారి తీసి ఉండొచ్చని తెలుస్తోంది.

,  ,  ,  ,  ,  ,