Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Nov-2017 14:03:14
facebook Twitter Googleplus
Photo

తాప్సీ పన్ను ప్రస్తుతం బాలీవుడ్ లో బాగానే సెటిల్ అయింది. దక్షిణాది నుంచి నార్త్ కు వెళ్లిన వేరే ఏ హీరోయిన్ తో పోల్చినా అమ్మడికి విజయాలు ఎక్కువగానే ఉన్నాయి. అటు పెర్ఫామెన్స్.. ఇటు కమర్షియల్ మూవీస్ తో సత్తా చాటేస్తున్న తాప్సీ.. కొన్ని విషయాల్లో మాత్రం ఉడుకుమోతుతనం తగ్గించుకోలేకపోతోంది.

సహజంగా కొన్ని హిట్స్ వచ్చిన తర్వాత ఓ స్టేటస్ సంపాదించుకున్నాక.. ప్రధానంగా సెలబ్రిటీ స్టేటస్ వచ్చాక మనసులో నుంచి కొన్ని రకాల ఫీలింగ్స్ ను బయటకు పంపేస్తారు. రీసెంట్ గానే జుడ్వా2 మూవీతో బ్లాక్ బస్టర్ కమర్షియల్ హిట్ ను కూడా ఖాతాలో వేసుకున్న తాప్సీ పన్ను.. తనకు ఇంకా టాప్ యాక్ట్రెస్ అంటే అర్ధం తెలియదని.. అస్సలు ఆ మాటే తన కెరీర్ లో వినిపించడం లేదని చెబుతోంది. అసలు టాప్ నటి అన్న మాటకు అర్ధం ఏంటో తెలియడం లేదని.. ఇందుకోసం ఏమైనా స్పెషల్ గా ఎగ్జామ్స్ ఉంటే రాసేందుకు తాను సిద్ధమంటూ వెటకారం కూడా ఆడుతోంది తాప్సీ. తనను ఎవరూ టాప్ హీరోయిన్ గా గుర్తించడం లేదన్నది ఈమె బాధ.

,  ,  ,  ,