Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-May-2015 11:01:23
facebook Twitter Googleplus
Photo

పవన్ కల్యాణ్ నటించే 'గబ్బర్ సింగ్ 2' చిత్రం పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే స్క్రిప్టును సిద్ధం చేశారు. ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దుతున్నారు. మరోపక్క సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సిటింగ్స్ కూడా మొదలుపెట్టాడు. 'గబ్బర్ సింగ్' చిత్రానికి సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చి, ఆ సినిమా విజయంలో దేవిశ్రీ కీలక పాత్ర పోషించిన సంగతి మనకు తెలిసిందే. అదే రీతిలో ఇప్పుడీ చిత్రానికి కూడా హిట్ మ్యూజిక్ ఇవ్వాలన్న కసితో వర్క్ చేస్తున్నాడట. త్వరలోనే ట్యూన్స్ ను ఫైనల్ చేస్తారు. ఈ నెలాఖరు నుంచి షూటింగును ప్రారంభించుకునే ఈ 'గబ్బర్ సింగ్ 2' చిత్రానికి 'పవర్' ఫేం బాబీ (కెయస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న విషయం విదితమే!

,  ,  ,  ,  ,  ,