Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Oct-2017 11:32:55
facebook Twitter Googleplus
Photo

ఆల్రెడీ ఎప్పుడో ముగిసినా కూడా.. మళ్ళీ మళ్లీ దీని గురించి అందరూ అడగటంతో స్టార్ హీరోయిన్ సమంత మాత్రం మళ్లీ మళ్ళీ క్లారిటీ ఇవ్వడానికి పెద్దగా సంకోచించట్లేదు. అదేనండీ.. అసలు పెళ్ళయ్యాక మామూలు జంటలే హనీమూన్ అంటూ దేశాలు చుట్టేస్తుంటే.. మరి స్టార్లు అయిన సమంత అండ్ నాగ చైతన్య కూడా ఎక్కడోచోటికి ఖచ్చితంగా వెళతారు కాబట్టి.. వారు ఎక్కడికి వెళ్తున్నారు అనే ఆలోచన సాధారణంగానే అందరికీ వస్తుంది.

ఇదే విషయాన్ని సమంత దగ్గర ప్రస్తావిస్తే.. అసలు ఇప్పడప్పుడే హనీమన్ ఆలోచన లేదని చెప్పేసింది. దానికి ఓ రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి.. అక్టోబర్ 6.. 7న వీరి పెళ్ళిళ్ళు అయ్యాక.. వెంటనే ఇద్దరూ కూడా వర్క్ తాలూకు కమిట్మెంట్లపై దృష్టి పెడతారట. కాబట్టి ఇద్దరూ కూడా పెళ్ళయ్యిన మూడవ రోజునే పనిలోకి దూకేస్తున్నారు. ఇకపోతే మనోళ్లు హనీమూన్ కు మూడ్నెళ్ళ తరువాత వెళ్తున్నారట. దానికో రీజన్ ఉంది. ఆ కారణం ఏంటంటే.. అసలు డిసెంబర్ చివరాకరలో యురోప్ అమెరికా టూర్ కు వెళితే ఆ కిక్కే డిఫరెంట్ గా ఉంటుంది. పైగా న్యూ ఇయర్ అండ్ క్రిస్టమస్ సమయం కాబట్టి.. అక్కడి ప్రాంతాలన్నీ భలే రిఫ్రెషింగ్ గా ఉంటాయి. అందుకే ఆ సమయంలో వీళ్ళు హనీమూన్ ప్లాన్ చేసుకున్నారట.

కాబట్టి సమంత అంతగా క్లారిటీ ఇచ్చాక.. మళ్ళీ మళ్ళీ ఆమెను మీ హనీమూన్ ఎప్పుడూ అని అడగటం బాగోదులే.

,  ,  ,  ,  ,