Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Mar-2017 10:52:47
facebook Twitter Googleplus
Photo

ఒక ఛాలెంజింగ్ రోల్ కు ఒక హీరోయిన్ని ఎంచుకున్నారంటే ఆమె పాత సినిమాలు చూసి ఇంప్రెస్ అవ్వడం వల్లే అనుకుంటాం. కానీ మహా నటి సావిత్రి పాత్రకు కీర్తి సురేష్ ను ఎంచుకోవడానికి అలాంటి కారణమేదీ లేదంటున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. కీర్తి ఇప్పటిదాకా మరీ గొప్పగా నటించేసి.. సావిత్రి పాత్ర కూడా బాగా చేయగలదు అని నమ్మకం కలిగించేసిన సినిమాలేవీ లేవంటున్నాడు అశ్విన్. అసలు కీర్తి సావిత్రి పాత్రను ఎలా చేస్తుందన్ని కూడా తనకు తెలియదని.. కాకపోతే ఆమె ఈ పాత్రకు సూటవుతుందన్న గట్ ఫీలింగ్ తో తనను మహానటి సినిమాకు ఎంచుకున్నానని నాగ్ అశ్విన్ తెలిపాడు.

అసలు కీర్తి సురేషే సావిత్రి పాత్రకు ఎందుకు అనే ప్రశ్నకు ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర సమాధానం చెప్పాడు నాగ్ అశ్విన్. ముందు సావిత్రి బయోపిక్ కోసం స్క్రిప్టు రెడీ చేశామని.. అప్పటికి ఈ పాత్రను ఎవరు చేస్తారన్నది తమకు కూడా క్లారిటీ లేదని.. అలాంటి సమయంలో సావిత్రి పాత్ర కోసం చాలామంది హీరోయిన్లను పరిశీలించామని.. కానీ ఎవ్వరిలోనూ సావిత్రి కనిపించలేదని నాగ్ అశ్విన్ తెలిపాడు. తమ సెర్చ్ కీర్తి సురేష్ దగ్గర ఆగిందని.. ఆమె ఇప్పటిదాకా గొప్పగా నటించిన పాత్రలేమీ లేవని.. అయినప్పటికీ సావిత్రి పాత్రలో ఆమె మెప్పించగలదని తనకు నమ్మకముందని అశ్విన్ చెప్పాడు. కీర్తి ముఖంలో సావిత్రిలో ఉండే అమాయకత్వం.. ముగ్ధత్వం రెండూ కనిపించాయని.. ఆమె ఆ పాత్రకు సూటవుతుందనిపించిందని అన్నాడు

,  ,  ,  ,  ,