అఖిల్ సినిమా నాగార్జునకి నచ్చలేదు. ఇది అఫ్ ది రికార్డ్ ట్రూత్. ఈ సినిమా ఫైనల్ వెర్షన్ చూసిన నాగ్ కొన్ని సీన్లు మార్చమని చెప్పారు. ఈ విషయంలో అఖిల్కీ, నాగ్కీ మాట మాట పెరిగి.. ఇద్దరికీ గ్యాప్ వచ్చిందని కూడా చెప్పుకొన్నారు. చివరికి అఖిల్ మాటే నెగ్గింది. రీషూట్లేం జరపకుండా, జస్ట్ వీఎఫ్ ఎక్స్ మార్చి సినిమాని విడుదల చేశారు. తీరా రిజల్ట్ చూసి డంగైపోయాడు అఖిల్. డాడీ మాట వింటే.. పలితం బాగుండేదేమో అని ఫీలయ్యాడని కూడా అప్పట్లో చెప్పుకున్నారు.
అయితే ఇప్పుడు రెండో సినిమాకి కూడా ఇదే తంతు నడుస్తోంది. నాగ్ తీసుకొచ్చిన దర్శకులు, కధలు అఖిల్ కి ఓ పట్టాణ నచ్చడం లేదని ఇన్నర్ సర్కిల్ టాక్. ఇలా చెప్పి చెప్పి విసిగిపోయిన నాగ్ ?ఇక నీ ఇష్టం రా అబ్బాయ్? అని వదిలేశారట. ఇప్పుడు రెండో సినిమాకి సంబధించిన కధ, దర్శకుడి విషయంలో మ్యూజికల్ చైర్ నడుస్తోంది. దాదాపు ఇండస్ట్రీ లో వున్న దర్షకులంతా అఖిల్ రెండో సినిమా విషయంలో గాసిప్ అయిన వారే. అయితే ఏదీ ఫైనల్ కావడం లేదు. మరి అఖిల్ సమస్యేమిటో