Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Feb-2017 12:52:05
facebook Twitter Googleplus
Photo

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మధ్యే తన కొత్త చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. రన్ రాజా రన్ ఫేమ్ సుజీత్ డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ ముందుగా అనుకున్న ప్రకారం మే నెల నుండి మొదలుకావాల్సి ఉంది. కానీ చిత్ర టీమ్ ఈ ప్లాన్ ని కాస్త మార్చారని తెలుస్తోంది. సుజీత్ ముందుగా మార్చి నెలలో సినిమాలోని కొంత భాగాన్ని షూట్ చేసి, దాని ద్వారా టీజర్ ను డెవలప్ చేస్తారట.
ఆ టీజర్ ను ఏప్రిల్ నెలాఖరున రిలీజ్ కానున్న భాహుబలి-2 తో పాటు రిలీజ్ చేస్తారని కూడా వినికిడి. ఎందుకంటే ప్రపంచంవ్యాప్తంగా కొన్ని వేల థియేటర్లలో బాహుబలి -2 రిలీజవుతుంది కాబట్టి దానితో పాటే టీజర్ ను రిలీజ్ చేసి థియేటర్లలో ప్రదర్శిస్తే సినిమా జనాల్లోకి ఎక్కువగా వెళ్లే అవకాశం ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది

,  ,  ,  ,  ,  ,