Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Aug-2016 10:42:40
facebook Twitter Googleplus
Photo

చాలా కాలంగా మంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్న అక్కినేని హీరో సుశాంత్ తాజాగా జి. నాగేశ్వర రెడ్ది దర్శకత్వంలో ఆటాదుకుందాం రా చిత్రంలో నటిస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో సుశాంత్ కు సపోర్ట్ గా అక్కినేని హీరోలు ?అఖిల్, నాగ చైతన్య?లు కనిపించనున్నారు.
అఖిల్ ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ లో కనిపిస్తున్నాడు. అలాగే నాగ చైతన్య కూడా స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నాడు. ఈ చిత్రంలో సుశాంత్ కు జోడీగా సోనం భజ్వా నటిస్తోంది. అలాగే ఇంటెర్వెల్, క్లైమ్యాక్స్ సన్నివేశాలు ఈ చిత్రానికి హైలెట్ గా నిలువనున్నాయని తెలుస్తోంది. ?అనూప్ రూబెన్స్? సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ?నాగ సుశీల? నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగష్టు 19న విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,