Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Jul-2017 14:06:08
facebook Twitter Googleplus
Photo

రియల్ లైఫ్ లో అయితే ఏదన్నా ఒక ప్రొఫెషన్ లో సెటిల్ అవ్వాలంటే చాలా కష్టమే. దానికోసం అహర్నిశలు తపస్సు చేస్తే కాని అది సాధ్యపడదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ నుండి డాక్టర్ వరకు.. ఫ్యాక్టరీ సూపర్ వైజర్ నుండి బిజినెస్ టైకూన్ వరకు.. అన్ని అంతే. కాని కష్టపడి ఒక యాక్టర్ గా సెటిల్ అయితే మాత్రం.. తెరపై ఇలాంటి పాత్రలను చక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది హీరోలు అదే చేస్తున్నారు.

మొన్నటి ప్రేమమ్ లో ఒక స్టూడెంటుగా.. ఆ తరువాత రారండోయ్ వేడుక చూద్దాంలో ఒక కాంట్రాక్టర్ కమ్ సివిల్ ఇంజనీర్ గా కనిపించిన నాగచైతన్య ఇప్పుడు తన తదుపరి సినిమాలో మరో ప్రొఫెషన్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. గతంలో బద్రిలో పవన్ కళ్యాణ్ మన్మథుడులో నాగార్జున యాడ్ ఏజెన్సీ నడుపుతూ యాడ్ ఫిలిం మేకర్లుగా కనిపించారు. ఇప్పుడు తండ్రి దగ్గర నుండి ఆ ప్రొఫెషన్ ను అందిపుచ్చుకుంటూ.. చైతూ కూడా త్వరలో మొదలుకానున్న చందు మొండేటి సినిమాలో ఒక యాడ్ ఫిలిం మేకర్ గా కనిపిస్తాడట. ఈ సినిమా ఒక రొమాంటిక్ కామెడీ కావడంతో..ఇది మన్మథుడు సినిమాకు సీక్వెల్ అనే టాక్ కూడా వినిపిస్తోంది.

ఇకపోతే ప్రస్తుతం యుద్దం శరణం సినిమా తాలూకు రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు చైతన్య. మొన్నటివరకు వరుసగా రొమాంటిక్ కామెడీలు చేసిన ఈ హీరో.. ఇప్పుడు మాత్రం యుద్దం శరణం సినిమాతో మరోసారి యాక్షన్ బాట పట్టాడు.

,  ,  ,  ,  ,