తీన్మార్, ఒంగోలు గిత్త, బ్రూస్లీ తదితర పెద్ద సినిమాల్లో నటించినా హీరోయిన్గా సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోయిన కృతి కర్భందా, తాజాగా హిందీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ?రాజ్ రీ బూట్? సినిమాతో సిద్ధమవుతున్నారు. బాలీవుడ్లో సూపర్ హిట్ ?రాజ్? సిరీస్‌లో నాలుగో సినిమాగా వస్తోన్న రాజ్ రీ బూట్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్ ఈ ఉదయం విడుదలైంది. ఈ సినిమాలో కృతి ఓ దయ్యంగా కనిపించనున్నారని సమాచారం. ఫస్ట్‌లుక్ కూడా ఈ అంశాన్ని బలపరిచేలానే ఉండడం విశేషంగా చెప్పుకోవాలి.
విక్రమ్ భట్ తెరకెక్కిస్తోన్న ఈ హర్రర్ డ్రామాలో ఇమ్రాన్ హశ్మీ హీరోగా నటిస్తున్నారు. ఈ ఉదయం విడుదలైన పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక తెలుగులో అనుకున్న గుర్తింపు తెచ్చుకోలేకపోయిన కృతి, బాలీవుడ్లో అయినా సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసమే కృతి కొన్నాళ్ళుగా ఇతర సినిమాలను పక్కనబెడుతూ వస్తున్నారు. సెప్టెంబర్ నెలలో రాజ్ రీ బూట్ ప్రేక్షకుల ముందుకు రానుంది.