Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Jul-2017 12:24:25
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ క్లాసిక్ మూవీని రీమేక్ చేసే ప్రయత్నాలు ఎప్పటినుంచో జరుగుతున్నాయి. అయితే ఈ ప్రయత్నాలకు ఇప్పటివరకూ ఓ రూపు రాలేదు. కానీ గుండమ్మ కథ రీమేక్ లో ఎవరు నటిస్తారనే విషయంపై మాత్రం ముందు నుంచి క్లారిటీ ఉంది.

ఎన్టీఆర్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్.. ఏఎన్నార్ పాత్రలో నాగచైతన్య నటిస్తారనే మాట మొదటినుంచి వినిపించింది. అయితే.. ఈ మాట వారి నోటా వీరి నోటా వినడమే తప్ప.. నేరుగా అసలు హీరోల నోట రాలేదు. ఇప్పుడు గుండమ్మ కథ రీమేక్ పై అక్కినేని నాగచైతన్య స్పందించాడు. గుండమ్మ కథ రీమేక్ చేసే ఆలోచనలు ఎప్పటినుంచో ఉన్నాయి. కానీ ఆ పాత్ర చేసేందుకు ముందు నాకు కొంత మెచ్యూరిటీ రావాల్సి ఉంది. మా తాత ఏఎన్నార్ పాత్రలో నేను నటించాలంటే అందుకు తగిన పరిపక్వత రావాల్సి ఉంటుంది. అయితే.. పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాకే ఈ రీమేక్ చేస్తాం అన్నాడు చైతు.

తాము గుండమ్మ కథను యాజ్ ఇటీజ్ గా రీమేక్ చేయాలని భావిచడం లేదని.. ఇప్పటి జనరేషన్ ఆఢియన్స్ కు తగినట్లుగా కథనంలో మార్పులు ఉంటాయన్న చైతు.. తప్పకుంటా జూనియర్ ఎన్టీఆర్ తో కలిసే గుండమ్మ కథను రీమేక్ చేస్తానని చెప్పాడు.

,  ,  ,  ,  ,