జనతా గ్యారేజ్ భయానికి ముందు వారం చెప్పుకోదగ్గ సినిమాలేమీ రిలీజ్ చేయలేదు. డబ్బింగ్ మూవీస్ 100 డేస్ ఆఫ్ లవ్.. తొలి ప్రేమలో.. తెలుగులో బంతిపూల జానకి.. అవసరానికో అబద్ధం.. ఎవరు లాంటి చోటా మోటా సినిమాలు మాత్రమే వచ్చాయి. ఇక ?జనతా గ్యారేజ్?కు పోటీగా ఈ వారం ఇంకే సినిమా కూడా రిలీజవ్వలేదు. తర్వాతి వారం రెండు సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి కానీ.. వాటికి లోలోపల గుబులుగానే ఉంది. ?జనతా గ్యారేజ్?కు అంచనాల ప్రకారం బ్లాక్ బస్టర్ టాక్ వస్తే వాటిలో కంగారు పుట్టేది. ఆ భయం లేదిప్పుడు. సినిమాకు పాజిటివ్ టాక్ ఉంది. అలాగే నెగెటివ్ టాక్ కూడా ఉంది.
?జనతా గ్యారేజ్? అంచనాల్ని అందుకోలేకపోయిందన్నది వాస్తవం. అలాగని సినిమా ఆడకుండా పోయే అవకాశాల్లేవు. తొలి వారాంతం కలెక్షన్లకు ఢోకా ఉండదు. ఎన్టీఆర్ గత సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్లే రాబట్టినా ఆశ్చర్యం లేదు. ఐతే సినిమాకు లాంగ్ రన్ మాత్రం కష్టమే. రెండో వారానికి కచ్చితంగా జోరు తగ్గొచ్చు. కాబట్టి వచ్చే వారాంతంలో రిలీజయ్యే ఇంకొక్కడు.. జ్యో అచ్యుతానంద సినిమాకు ఇబ్బంది లేకపోవచ్చు. ఆ రెండు సినిమాల మీదా అంచనాలు బాగానే ఉన్నాయి. వాటికి పాజిటివ్ టాక్ వస్తే.. ?జనతా గ్యారేజ్?కు దెబ్బ పడుతుంది. అవి అంచనాల్ని అందుకోలేకపోతే ?గ్యారేజ్?కు కలిసొచ్చి.. కలెక్షన్లు పుంజుకోవచ్చు. ఐతే ?జనతా గ్యారేజ్? విషయంలో ఆ సినిమాలు భయపడాల్సిన పనైతే లేదు.