Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Oct-2016 12:21:10
facebook Twitter Googleplus
Photo

అక్కినేని నాగచైతన్య కెరీర్లో ఎప్పటికీ గుర్తుంచుకునే సినిమా ఏమాయ చేసావె. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను అంత సులువుగా మరిచిపోలేరు. మళ్లీ చైతూ-గౌతమ్ కాంబినేషన్లో మొదలైన సాహసం శ్వాసగా సాగిపో మీద కూడా విపరీతమైన ఆసక్తి ప్రదర్శించారు ప్రేక్షకులు. కానీ ఎప్పుడో ఏడాది కిందట మొదలైన ఈ సినిమా ఇప్పటిదాకా విడుదలకు నోచుకోలేదు. ఇదిగో అదిగో అంటూ ఈ సినిమాను వాయిదాల మీద వాయిదాలు వేసేస్తున్నారు.

చాన్నాళ్లు వార్తల్లో లేకుండా పోయిన ?సాహసం శ్వాసగా సాగిపో? మళ్లీ రెండు రోజుల కిందట మళ్లీ జనాల నోళ్లల్లో నానింది. ఈ సినిమా కొత్త ట్రైలర్ గురువారం రిలీజ్ చేస్తారని.. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారని ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. కానీ గురువారం ట్రైలర్ రిలీజ్ లాంటిదేమీ జరగలేదు. టెక్నికల్ ఇష్యూస్ వల్ల ట్రైలర్ వాయిదా పడిందట.

ఐతే ఈ సమాచారం కూడా సినిమాకు కీలకమైన వ్యక్తుల నుంచి రాలేదు. అసలు ?సాహసం..? సినిమాను తెలుగులో సమర్పిస్తున్న కోన వెంకట్ చాన్నాళ్లుగా దీని ఊసే ఎత్తట్లేదు. మరోవైపు గౌతమ్ మీనన్ కూడా ట్విట్టర్లో ఈ సినిమా ప్రస్తావన తేవట్లేదు. తమిళ వెర్షన్ గురించి అప్పుడప్పుడు ట్వీట్లు పెడుతున్న గౌతమ్ కూడా తెలుగు వెర్షన్ గురించి మాట్లాడట్లేదు. మరోవైపు ?ప్రేమమ్? సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న నాగచైతన్య కూడా ఈ సినిమా విషయంలో సైలెంటుగానే ఉంటున్నాడు. మరి ?సాహసం..? సంగతేమవుతుందో చూడాలి

,  ,  ,  ,  ,