Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Jul-2016 15:32:44
facebook Twitter Googleplus
Photo

అక్కినేని నట వారసుడు నాగ చైతన్య ఈ సారి డిఫరెంట్ గా ట్రై చేస్తున్నాడు. ఆటోనగర్ సూర్య, ఒక లైలా కోసం, దోచేయ్ వంటి సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో కాస్త గ్యాప్ తీసుకున్న ఈ యంగ్ హీరో బాగా ఆలోచించి తరువాత చేయబోయే సినిమాల్లో కాస్త చేంజ్ ఉండేలా చూసుకున్నాడు. అవేంటంటే ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అవుతున్న ఆయన రెండు సినిమాల్లో ?సాహసం శ్వాసగా సాగిపో? చిత్రానికి దర్శకుడు తమిళ పరిశ్రమకు చెందిన ?గౌతమ్ మీనన్? కాగా, రెండవ సినిమా ?ప్రేమమ్? మలయాళ సినిమా ?ప్రేమమ్? కు రీమేక్.
ఈ రెండు సినిమాలపై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన సాహసం స్వాసగా సాగిపో చిత్రం ఆడియో మంచి ఆదరణ పొందుతోంది. ఈ చిత్రం ఆగష్టు 19న విడుదలకు సిద్దమవుతోంది. అలాగే చందూ మొండేటి తెరకెక్కిస్తున్న ?ప్రేమమ్? కూడా నెల వ్యవధిలో సెప్టెంబర్ 9 న విడుదల కానుంది. ఇలా రెండు సినిమాల్లోనూ ఏదో ఒక వైవిధ్యం ఉండేలా నాగ చైతన్య చేసిన ప్రయత్నం ఎంత వరకూ సక్సెస్ అవుతుందో తెలియాలంటే ఈ రెండు సినిమాలు విడుదలయ్యే దాకా ఆగాల్సిందే.

,  ,  ,  ,  ,  ,