Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Jun-2017 12:54:38
facebook Twitter Googleplus
Photo

ఒక సినిమాలో పాట బాగా క్లిక్ అయి జనాల్లో విపరీతంగా నానితే.. ఆ తర్వాత ఆ పాట పల్లవినో.. జనాలకు నచ్చిన లైన్స్ లో టైటిల్స్ గా పెట్టేసుకునే కల్చర్ ఎప్పటి నుంచో ఉంది. మెగాస్టార్ చిరంజీవి కూడా బావగారూ బాగున్నారా అంటూ ఈ ట్రెండ్ లో ఓ సినిమా చేసేసిన సంగతి తెలిసిందే.

రీసెంట్ గా నాని నటించిన నేను లోకల్ బ్లాక్ బస్టర్ అయింది. ఇందులో నెక్ట్స్ ఏంటి అనే పాట సూపర్ సక్సెస్ సాధించడమే కాదు.. సింపుల్ లైన్స్ తో అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ నెక్ట్స్ ఏంటి అనే పదమే ఓ సినిమా టైటిల్ గా మారిపోవడం విశేషం. వీ4 బ్యానర్స్ పై రూపొందుతున్న లేటెస్ట్ మూవీ కోసం నెక్ట్స్ ఏంటి అనే టైటిల్ ను ఫిక్స్ చేసుకున్నారు. గీతా ఆర్ట్స్.. యూవీ క్రియేషన్స్.. బన్నీ వాసు కలిసి నిర్మిస్తున్న మూవీకి ఈ టైటిల్ ను ఖాయం చేసేశారు. బుల్లితెర మెగాస్టార్ అని పిలిపించుకున్న ఈటీవీ ప్రభాకర్.. ఈ చిత్రం ద్వారా దర్శకుడు కావడం విశేషం.

నెక్ట్స్ ఏంటి మూవీలో సాయి కుమార్ కొడుకు ఆది హీరోగా నటిస్తుండగా.. రష్మీ అందాలు బోనస్ గా నిలవనున్నాయి. సాయికుమార్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని.. ఓ తమిళ్ హారర్ కామెడీ ఆధారంగా రూపొందిస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,