Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Jan-2017 10:36:52
facebook Twitter Googleplus
Photo

మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాకు జనాల నుంచి వచ్చిన స్పందన చూసి షాకైపోయానంటున్నాడు చిరు సోదరుడు నాగబాబు. చిరంజీవిని జనాలు బాగానే రిసీవ్ చేసుకుంటారనుకున్నాం కానీ.. మరీ ఈ స్థాయిలో ఆయనపై ప్రేమ కురిపిస్తారని అస్సలు ఊహించలేదని నాగబాబు చెప్పాడు. అంచనాల కంటే 10 రెట్లు అధికంగా ఈ సినిమాకు ఫలితం వచ్చిందని నాగబాబు అన్నాడు. ఇంకా ఖైదీ నెంబర్ 150 విషయంలో నాగబాబు ఏమన్నాడంటే..

అన్నయ్య మా అందరికీ ఆదర్శం. మా ఇంట్లో చాలామంది హీరోలున్నా సరే..అన్నయ్య అరంగేట్రం చేసినపుడు.. తొలి సక్సెస్ అందుకున్నపుడు నేనెంత థ్రిల్ ఫీలయ్యానో మా వాళ్లందరూ ఖైదీ నెంబర్ 150 సక్సెస్ తో అలా థ్రిల్లయ్యారు. గత పదేళ్లుగా ఈ ఫీలింగ్ ను మేం మిస్సయ్యాం. నా వయసు వాళ్లు.. ఆయన పునరాగమనం ఎంతగానో ఎదురు చూస్తున్నాం. అన్నయ్యను తెలుగు ప్రేక్షకులు బాగానే రిసీవ్ చేసుకుంటారని తెలుసు. కానీ ఖైదీ నెంబర్ 150కి వచ్చిన రెస్పాన్స్ మేం ఊహించనిది.

రాజకీయాల్లో అన్నయ్యను కొందరు వ్యతిరేకించి ఉండొచ్చు. కానీ సినిమాల్లో మాత్రం అందరూ ఆయన వెంటే ఉన్నారని రుజువైంది. ఖైదీ నెంబర్ 150కి వచ్చిన రెస్పాన్స్ చూసి నేను షాకయ్యాను. నేను అనుకున్న దాని కంటే రెస్పాన్స్ 10 రెట్లు ఎక్కువగా కనిపించింది. రాజకీయ కారణాలేవీ కూడా ఖైదీ నెంబర్ 150 మీద ప్రభావం చూపలేదు. సినిమాల వరకు అన్నయ్య అందరివాడే అని రుజువైంది. ఆయన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి రాజు.. బాద్ షా అని నాగబాబు అన్నాడు. జనాలు చిరంజీవిని స్వాగతించినంతగా మీడియా స్వాగతించలేదని.. దీంతో ఖైదీ నెంబర్ 150 విషయంలో చాలా నెగెటివిటీ కనిపించిందని నాగబాబు అభిప్రాయపడ్డాడు. చిరంజీవి రాజకీయ ప్రస్థానం ముగింపునకు వచ్చిందా లేదా అన్నది చెప్పలేమని.. ఐతే ఆయన వరుసగా సినిమాలు చేయాలని మాత్రం అనుకుంటున్నారని నాగబాబు తెలిపాడు

,  ,  ,  ,  ,