Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Nov-2017 10:44:42
facebook Twitter Googleplus
Photo

నాగబాబు ఎప్పటి నుంచో సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. ఈ మధ్య జబర్దస్త్ టీవీషోతో బాగా బిజీగా ఉన్నారు. ఆయన కొడుకు వరుణ్ తేజ్ హీరోగా సక్సెస్ సాధించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఆయన కుమార్తె నీహారిక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మొదటి హీరోయిన్ గా క్రెడిట్ దక్కించుకుంది.

తాజాగా నాగబాబు ఫ్యామిలీ మొత్తం ఓ ఫొటోలో చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. కుటుంబంలోని నలుగురు లంచ్ చేసేందుకు కలిసి బయట కు వచ్చినప్పుడు హీరో వరుణ్ తేజ్ ఓ సెల్ఫీ క్లిక్ మనిపించాడు. ఇందులో వరుణ్ తేజ్ గడ్డం.. బ్లాక్ స్పెర్ట్ తో డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. నిహారిక కూడా అన్న తీస్తున్న ఫొటోకు నవ్వుతూ ఫోజిచ్చింది. వెనుకగా నాగబాబు వైఫ్ పిల్లలిద్దరి సంతోషాన్ని ఎంజాయ్ చేస్తుంటే.. చివర నాగబాబు మిస్టర్ కూల్ తరహాలో నుంచున్నారు. ఈ మెగా ఫ్యామిలీ ఫొటో సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది. వరుణ్ అండ్ నిహారిక యాక్టింగ్ లో పాపులర్ అయ్యాక టోటల్ ఫ్యామిలీ మొత్తం ఒక ఫ్రేమ్ లోకి రావడం చాలా రేర్ గా జరిగే పరిణామం. అందుకే ఈ సెల్ఫీకి ఇంతటి క్రేజ్ వచ్చేసింది.

వరుణ్ తేజ్ ప్రస్తుతం వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాతగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. రాశీఖన్నా తొలిసారి వరుణ్ కు జోడీగా కనిపించనుంది. ఇక నాగబాబు - నీహారికలిద్దరూ కలిసి తండ్రీ కూతుళ్లుగా నాన్నకూచి అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు.

,  ,  ,  ,  ,