Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Oct-2017 10:35:10
facebook Twitter Googleplus
Photo

నాగార్జున ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. మరో 3 రోజుల్లో గోవాలో తన పెద్ద కుమారుడు నాగచైతన్య వివాహం.. ఆ తర్వాత హైద్రాబాద్ లో భారీ స్థాయిలో నిర్వహించాల్సిన రిసెప్షన్.. మరోవైపు రాజుగారి గది2 ప్రచార కార్యక్రమాలు.. ఇలా ఒక్కసారిగా ఫుల్ బిజీగా మారిపోయారు నాగ్. తన బిజీ కారణంగానే రాజు గారి గది2 ప్రమోషన్స్ ను 10 రోజుల ముందే స్టార్ట్ చేసిన ఆయన.. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తున్నారు.

ప్రస్తుతం ఏ మూవీ షూటింగ్ ను ప్రారంభించకపోయినా.. త్వరలో నానితో కలిసి ఓ మల్టీస్టారర్ లో నటించబోతున్నానని చెప్పిన నాగ్.. శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో అశ్వినీదత్ నిర్మాతగా ఈ మూవీ ఉంటుందని అనౌన్స్ చేశారు. అలాగే కార్తికేయ.. ప్రేమమ్ చిత్రాల దర్శకుడు చందూ మొండేటితో తాను ఓ సినిమా చేసే ఛాన్స్ ఉందని చెప్పారు నాగ్. ఇప్పటికే సవ్యసాచి ప్రాజెక్టును రూపొందిస్తున్న చందూ మొండేటితో తాను సినిమా చేయాలని ఆసక్తిగా ఉన్నట్లు చెప్పిన నాగ్.. ఇందుకోసం ఈ దర్శకుడికి ఓ కండిషన్ ను పెట్టడం విశేషం.

చందూ నాకు వీరాభిమాని అని నాకు తెలుసు. అయితే.. తను ఓ దర్శకుడిగానే నాతో సినిమా చేయాలి.. ఓ అభిమానిగా ఉండకూడదు అని చందూమొండేటికి సూచించినట్లు చెప్పారు నాగ్.

,  ,  ,  ,  ,