Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Jul-2016 11:42:04
facebook Twitter Googleplus
Photo

కమెడియన్‌గా సూపర్ స్టార్‌డమ్ సంపాదించుకున్న సునీల్, ఆ తర్వాత హీరోగా మారి సినిమాలు చేస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. కొద్దికాలంగా ఆయన హీరోగా నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేక ఆయన హీరో కెరీర్‌ను అయోమయంలో పడేశాయి. దీంతో మళ్ళీ ఎలాగైనా ఓ మంచి హిట్ కొట్టాలని సునీల్ ప్రస్తుతం ?జక్కన్న?, ?ఈడు గోల్డ్ ఎహె? సినిమాలతో సిద్ధమవుతున్నారు. ఈ రెండు సినిమాల్లో ?జక్కన్న? ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని జూలైలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
కాగా ?ఈడు గోల్డ్ ఎహె? అన్న సినిమా కూడా ఇప్పటికే దాదాపుగా పూర్తి కావచ్చింది. దర్శకుడు వీరు పోట్ల తెరకెక్కిస్తోన్న ఈ సినిమా క్లైమాక్స్ మినహా టాకీపార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. ఇక క్లైమాక్స్‌ షెడ్యూల్‌ను రేపట్నుంచి మొదలుపెడుతున్నారు. క్లైమాక్స్ కూడా పూర్తైతే ఒక్క పాట మినహా సినిమా అంతా పూర్తవుతుంది. సునీల్ సరసన సుష్మా రాజ్, రిచా పనాయ్‌లు హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

,  ,  ,  ,  ,  ,