Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Dec-2017 11:36:49
facebook Twitter Googleplus
Photo

సినిమాల్లో పాటలు.. ఫైట్లు ఎంత ముఖ్యమో డాన్సులు కూడా అంతే కూడా ఇంపార్టెన్స్ ఉంటోంది. కొంత మంది యంగ్ హీరోలు.. స్టార్స్ అయితే మరీ ఒళ్లు విరిచేసుకుని మరీ డ్యాన్సులు వేస్తున్నారు. గతంతో పోల్చితే డ్యాన్సుల తీరు మారిపోయిందని.. స్టైలిష్ గా కనిపించడం లేదని.. స్వయంగా మెగాస్టార్ చెప్పిన మాటలు కూడా ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవచ్చు.

ఇప్పుడు నాగార్జున కూడా ఇదే తరహా మాటలు చెప్పారు. అఖిల్ నటించిన హలో చిత్రానికి ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ లో తెగ యాక్టివ్ గా పాల్గొంటున్న నిర్మాత నాగార్జున.. డ్యాన్సులపై తన స్టైల్ లో కామెంట్స్ చేశారు. అవసరమైతే డ్యాన్సులు చేయాలి కానీ.. అస్తమానం అవే చేస్తానంటే ఎలా అన్నది ఆయన వెర్షన్. వెనకాల ఓ 50 మందిని పెట్టుకుని ఎక్సర్ సైజులు చేస్తూ.. అవే డ్యాన్స్ అంటే ఎలా అని కూడా నిలదీశారాయన. అంతే కాదు.. డ్యాన్సులు ఉంటే సినిమాలు ఆడేస్తాయా అంటూ క్వశ్చన్ చేశారు కూడా. నాగ్ వరకూ చూసుకుంటే ఈ వెర్షన్ కరెక్టే అనిపిస్తుంది.

కానీ ప్రస్తుతం డ్యాన్సింగ్ ట్రెండ్ పీక్స్ లోనే నడుస్తోంది. అటు బాలీవుడ్.. ఇటు టాలీవుడ్ మాత్రమే కాదు.. వీటిపై ప్రత్యేకంగా టెలివిజన్ షోలు కూడా సూపర్ సక్సెస్ అయిపోతున్నాయి. ఇప్పుడు డ్యాన్సులపై సింగిల్ సైడ్ గా నాగార్జున ఇంతలేసి మాట్లాడ్డం చూస్తే.. హలో మూవీలో అఖిల్ తో డ్యాన్సులు చేయించే విషయంపై పెద్దగా కాన్సంట్రేట్ చేసినట్లుగా లేదనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే.. అఖిల్ డ్యాన్సుల విషయంలో బోలెడంత దిట్ట అనే విషయం మొదటి సినిమాతోనే ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి.. ఈసారి ఫ్యాన్స్ అంతకంటే ఎక్కువ డ్యాన్సులను ఆశిచండంలో తప్పేమీ లేదు

,  ,  ,  ,