Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Sep-2016 13:32:02
facebook Twitter Googleplus
Photo

దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ?బాహుబలి ? ది కన్ క్లూజన్? చిత్రీకరణ పూర్తికాకముందే ప్రీ రిలీజ్ బిజినెస్ తారా స్థాయిలో జరుగుతోంది. ఇప్పటికే పలు ఏరియాల్లో ఈ చిత్రం యొక్క రైట్స్ ను డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తం ఇచ్చి కొనుగోలు చేయగా టాలీవుడ్ కు చెందిన స్టార్ హీరో, బిజినెస్ మేన్ అక్కినేని నాగార్జున కూడా ఈ చిత్రం రైట్స్ ను కొన్నట్టు తెలుస్తోంది.
ప్రముఖ నిర్మాత, వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటితో కలిసి నాగార్జున కృష్ణ జిల్లా హక్కులను రూ. 8 కోట్ల భారీ మొత్తానికి కొన్నారని వినికిడి. గతంలో కూడా బాహుబలి- 1 రైట్స్ ను కొనాలనుకున్న నాగార్జున అప్పుడెందుకో వెనక్కు తగ్గారు. ఇప్పుడు బాహుబలి ? 1 బ్లాక బస్టర్ అవడంతో రెండవ పార్ట్ రైట్స్ దక్కించుకున్నారట. ఈ విషయంపై నాగార్జున నుండి గాని, సాయి కొర్రపాటి నుండి గాని ఇంకా స్పష్టమైన ప్రకటన రాలేదు. ఇకపోతే ప్రస్తుతం పాటల షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2017 ఏప్రిల్ 28న విడుదల చేయనున్నారు.

,  ,  ,  ,  ,  ,  ,