Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Jul-2016 10:36:51
facebook Twitter Googleplus
Photo

కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా ఓం నమో వెంకటేశాయ పేరుతో ఓ భక్తిరస చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. నాగార్జునతో కలిసి అన్నమయ్య, శ్రీరామదాసు, షిర్డీసాయి లాంటి భక్తిరస చిత్రాలను అందించిన దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఈనెల 30న విడుదల చేయనున్నారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ రెండు రోజుల్లో ?ఓం నమో వెంకటేశాయ? తొలి దర్శనం (ఫస్ట్‌లుక్) ఉంటుందని రాఘవేంద్ర రావు తెలిపారు.
సెట్లో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ, భక్తి, శ్రద్ధలతో ఈ సినిమాను తెరకెక్కిస్తోన్న టీమ్ తొలి దర్శనం అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపింది. ?మనం?, ?సోగ్గాడే చిన్ని నాయనా?, ఊపిరి సినిమాలతో ఈతరం ప్రేక్షకుల్లో తనదైన స్థానం సంపాదించుకున్న నాగార్జున, ఓం నమో వెంకటేశాయ, ఆ స్థాయిని మరింత పెంచేదిగా నిలుస్తుందని చెబుతూ వస్తున్నారు. మహేష్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అనుష్క, ప్రగ్యా జైస్వాల్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,