Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Jun-2016 12:47:11
facebook Twitter Googleplus
Photo

సంక్రాంతి బెర్తులు ఒకొక్కటిగా కన్ ఫమ్ అవుతున్నాయి. ఇప్పటికే చిరు - బాలయ్యలు సంక్రాంతికొస్తున్నట్టు ప్రకటించేశారు. త్వరలోనే రంగంలోకి దిగబోతున్న నాగార్జున కూడా సంక్రాంతికే తన సినిమాని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించబోతున్నారట. అదేగనక నిజమైతే సంక్రాంతి పోటీ రసవత్తరంగా మారుతుంది. బలమైన పందెం కోళ్లు బరిలో నిలిచినట్టుగా అవుతుంది. అయితే మొన్నటిదాకా చిరు వర్సెస్ బాలయ్య అంటూ మాట్లాడుకొన్న జనాలు ఇప్పుడు బాలయ్య వర్సెస్ నాగ్ అంటున్నారు. అందుకు బలమైన కారణం కూడా ఉంది. వీళ్లిద్దరి సినిమాలు గత సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చాయి. రెండు చిత్రాలు కూడా హిట్టు టాక్ ని సొంతం చేసుకొన్నాయి.

అయితే నాగ్ సోగ్గాడే చిన్ని నాయనా మాత్రం యాభై కోట్ల మార్క్ ని అధిగమించి సత్తా చాటింది. బాలయ్య సినిమా ఆ మార్క్ని చేరుకో్కపోయినా అభిమానుల్ని మాత్రం బాగానే అలరించింది. తదుపరి కూడా వీళ్లిద్దరి సినిమాలే వస్తుండటంతో పోటీ రసవత్తరంగా మారింది. మరి ఈసారి గౌతమ పుత్ర శాతకర్ణితో బాలయ్య పైచేయి సాధిస్తాడా లేక నమో వెంకటేశాయతో నాగార్జున పైచేయి సాధిస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది. నాగ్ చిత్రం ఈ నెలలోనే మొదలు కాబోతోందట. ఇప్పటికే అనుష్క - విమలారామన్ - ప్రగ్య జైశ్వాల్ లని కథానాయికలుగా ఎంపిక చేసుకొన్నారు. కథ కూడా పక్కాగా సిద్ధం కావడంతో నాగ్ ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళదామా అన్న కుతూహలంతా ఉన్నారు. శిరిడిసాయి తర్వాత నాగ్ భక్తిరస చిత్రంలో నటిస్తున్నది ఇప్పుడే. మరి ఈసారి ఎలాంటి రిజల్ట్ ని సొంతం చేసుకొంటాడో చూడాలి.

,  ,  ,  ,  ,  ,  ,