Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Oct-2017 10:14:35
facebook Twitter Googleplus
Photo

25 సంవత్సరాల క్రితం శివ సినిమాలో సైకిల్ చైన్ తెంపి చేతికి చుట్టుకుని రౌడీలను చితక్కొట్టే సీన్ నాగార్జున అభిమానులు ఇప్పటికీ మరిచిపోలేదు. అంతెందుకు... నాగార్జున కూడా మర్చిపోకపోవచ్చు. అలాంటి స్టయిలిష్ యాక్షన్ పిక్చర్ మళ్లీ చేయాలని అనుకుంటున్నాడు నాగ్. అందుకే మరోసారి రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.

ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ రాజుగారిగది-2 సినిమా ప్రచారం చేయడంలో నాగార్జున బిజీబిజీగా ఉన్నాడు. లాస్ట్ వీక్ రిలీజైన ఈ మూవీ మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు నాగ్ ప్రమోషన్ బాగానే చేస్తున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘ఈమధ్య ఎమోషనల్ సినిమాలు.. ఫ్యామిలీ ఎంటర్ టెయినర్లు చాలానే చేశా. దీనికి భిన్నంగా స్టయిలిష్ యాక్షన్ ఫిలిం చేద్దామని అనుకుంటున్నా. ఇంతలో రామ్ గోపాల్ వర్మ ఓ బ్రహ్మాండమైన స్క్రిప్ట్ వినిపించాడు. అది నచ్చడంతో సినిమా చేయడానికి అంగీకరించా’’ అంటూ నాగ్ చెప్పుకొచ్చాడు.

పదిరోజులుగా రాజుగారి గది-2 సినిమా ప్రమోషన్లలోనే బిజీగా ఉండటంతో కాస్త బ్రేక్ తీసుకోవాలని నాగార్జున డిసైడయ్యాడు. ఓ పది రోజులు యూఎస్ వెళ్లి హాలిడేస్ ఎంజాయి చేసి రావాలని అనుకుంటున్నాడు.

,  ,  ,  ,