Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Dec-2017 11:48:37
facebook Twitter Googleplus
Photo

హలో సినిమా రిలీజ్ కు అంతా సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై బజ్ పెంచేలా అఖిల్ తండ్రి.. సినిమా నిర్మాత నాగార్జున ప్లాన్ చేస్తూ వచ్చాడు. తాజాగా సినిమా రిలీజ్ కు ముందు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశాడు. ఓ రేంజిలో ఉందనిపించేలా ఈవెంట్ చేయడమే కాకుండా మెగా అభిమానులు సైతం ముచ్చట పడిపోయేలా చిరంజీవి రామ్ చరణ్ లిద్దరినీ ఈ ఫంక్షన్ కు ఇన్వైట్ చేశాడు.

ఇంతవరకు హలో సినిమా గురించి కొత్త కొత్త విశేషాలు చెబుతూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతూ వచ్చిన నాగార్జున ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాత్రం సినిమా గురించి తాను చెప్పాల్సిందంతా ముందే చెప్పేశానని.. కొత్తగా చెప్పడానికేం లేదనేశాడు. కానీ టెక్నీషియన్స్ అందరికీ ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకొచ్చాడు. డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ ను ఈ సినిమాకు హీరో అంటూ కితాబిచ్చేశాడు. విక్రమ్.. మీకు తెలీదు.. మా కుటుంబం ఎంత గొప్పో చెప్పలేం. ఎన్నోసార్లు చెబుతున్నా.. మళ్లీ చెబుతున్నా. థ్యాంక్స్ ఫర్ మనం. థ్యాంక్స్ ఫర్ హలో. చక్కటి సినిమా ఇచ్చావ్ అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు.

ఇంటికి కొత్తగా కోడలొచ్చింది. ఎప్పుడూ నవ్వుతూ కళకళలాడుతూ ఉంటుంది. తను ఇంటికొచ్చిందంటే పక్షులు కిచకిచలాడుతున్నట్టు సందడిగా ఉంటుంది అంటూ కొత్త కోడలు సమంతను చూస్తూ ఆనందంగా నాగ్ చెప్పుకొచ్చాడు. సినిమా ఎలా ఆడుతుంది అన్నది ఇప్పుడు చెప్పడానికేం లేదు. అఖిల్ ను చూస్తే కడుపు నిండిపోయింది. ఈ రోజు చాలా చాలా తృప్తిగా.. ఆనందంగా ఉంది అని తన పుత్రోత్సాహం మొత్తం నాగార్జున మాటల్లో బయటపెట్టాడు

,  ,  ,  ,  ,  ,  ,