Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Jul-2017 14:29:27
facebook Twitter Googleplus
Photo

నక్షత్రం. గత ఏడాదే పూర్తయి విడుదల కావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. చివరికి ఈ ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకున్నారు. పలుమార్లు విడుదల గురించి ప్రకటనలు ఇచ్చారు. చివరికి ఈ నెల 28న సినిమాను విడుదల చేస్తున్నట్లుగా ఇటీవలే అనౌన్స్ చేశారు. రిలీజ్ డేట్ పోస్టర్లు కూడా వదిలారు. కానీ ఈ తేదీకి కూడా ఆ సినిమా విడుదల కావల్లేదు. ఈ చిత్రాన్ని వారం ఆలస్యంగా ఆగస్టు 4న రిలీజ్ చేస్తామని తాజాగా ప్రకటన వచ్చింది. ఈ నెల 28న గౌతమ్ నంద మంచి అంచనాల మధ్య రిలీజవుతున్న నేపథ్యంలో.. ఆగస్టు 4కు వెళ్లినట్లు తెలుస్తోంది.

రానా సినిమా నేనే రాజు నేనే మంత్రి ని ఆగస్టు 4 నుంచి 11కు వాయిదా వేసిన నేపథ్యంలో ఆ తేదీ మంచిదని భావించినట్లుంది. అదే రోజు సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కిన దర్శకుడు కూడా విడుదలవుతుంది. 28 నుంచి నక్షత్రం వెళ్లిపోయిన నేపథ్యంలో గౌతమ్ నంద’కు లైన్ క్లియరైనట్లే. అదే తేదీన రావాల్సిన తమిళ డబ్బింగ్ సినిమా వీఐపీ-2 కూడా వాయిదా పడటంతో గౌతమ్ నంద సోలోగా థియేటర్లలోకి దిగబోతోంది. గోపీచంద్ కు ప్రస్తుతం హిట్టు చాలా అవసరం. ఈ సినిమాపై పెట్టుబడి కూడా ఎక్కువే పెట్టారు. కాబట్టి ఈ సినిమా సూపర్ హిట్ కావాల్సిందే. భగవాన్.. పుల్లారావు నిర్మించిన ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహించాడు.

,  ,  ,  ,  ,  ,