Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Jul-2017 14:15:35
facebook Twitter Googleplus
Photo

ఐటం సాంగ్ అంటేనే విజిల్స్ మోతెక్కిపోతున్నాయి. పోర్న్ స్టార్ నుంచి సినిమా యాక్టర్ గా మారిన అందాల భామ డ్యాన్స్ చూసి మైమరిచిపోని వారుండరు. లాస్ట్ ఇయర్ రిలీజైన రయీస్ సినిమాలో లైలా ఓ లైలా రీమిక్స్ సాంగ్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.

తాజాగా వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ లైలా ఓ లైలా పాటకు డ్యాన్స్ చేసి దానిని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. పనిలో పనిగా అభిమానులకు ఓ సవాల్ కూడా విసిరాడు. ఈపాటకు తనకంటే బాగా డ్యాన్స్ చేసి నామినేషన్లు పంపాల్సిందిగా ఇన్వైట్ చేశాడు. అలా డ్యాన్స్ చేసిన వారిలో బెస్ట్ పెర్ఫార్మర్ కు 5000 యూఎస్ డాలర్లు ప్రైజ్ మనీ కూడా ఇస్తానని అనౌన్స్ చేశాడు.

ఈ ఛాలెంజ్ ను సన్నీలియోన్ యాక్సెప్ట్ చేసింది. తాజాగా తాను నటించిన హిందీ సినిమాలోని పాటను అతడికి పంపించింది. హే గేల్.. దిసీజ్ మై నామినేషన్ అంటూ ట్వీట్ కూడా చేసింది. ఆమె డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూశానంటూ గేల్ తిరిగి బదులిచ్చాడు. ఇంకో వారం రోజుల్లో గేల్ విన్నర్ అనౌన్స్ చేయనున్నాడు.

,  ,  ,  ,  ,