Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jan-2017 12:32:11
facebook Twitter Googleplus
Photo

ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఫ్యామిలీ మూవీగా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది శతమానం భవతి. ఈ సినిమాలో శర్వానంద్ తో కలిసి మలయాళీ కుట్టి అనుపమా పరమేశ్వరన్ రొమాన్స్ చేసింది. ఈమెకు తెలుగులో ఇది మూడో సినిమా అనే కానీ.. ఇప్పటివరకూ ఈమె ట్యాలెంట్ ను పూర్తి స్థాయిలో చూసే ఛాన్స్ తెలుగు ఆడియన్స్ కు దక్కలేదు. మొదట అ..ఆ..లో కొన్ని సీన్లలో కనిపించే ఓ చిన్న పాత్రలో చేసిందంతే. ఆ తర్వాత చైతు ప్రేమమ్ లో అయితే.. ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నటించింది.

కానీ శతమానం భవతిలో మాత్రం అనుపమానే హీరోయిన్. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పుడు 'నాలో నేను.. నీలో నేను..' అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. శర్వ-అనుపమల మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ ఇది. శర్వానంద్ ఎప్పటిలాగే ఆకట్టుకుంటే.. అనుపమా మాత్రం తన ఫీలింగ్స్ తో ఇరగదీసేసింది. రొమాన్స్ ఫీలింగ్ ని ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ లో చూపిస్తూ.. కుర్రాకారును కట్టిపడేసింది.

తన ట్యాలెంట్ ను పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు చూపించే అవకాశాన్ని కొంచెం కూడా మిస్ చేసుకోలేదు అనుపమా పరమేశ్వరన్. బావా మరదళ్ల లవ్ స్టోరీలో.. భలేగా మెప్పించింది ఈ భామ. ఎక్స్ పోజింగ్ అనే పదం కూడా గుర్తుకురాకుండా గ్లామరస్ గా కనిపించిన తీరుకి అయితే.. అనుపమను తెగ పొగిడేయాల్సిందే.

,  ,  ,  ,  ,