Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Jun-2017 16:07:49
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడొచ్చే సినిమాల్లో కంటెంట్ కంటే ముఖ్యంగా క్యాస్టింగ్ పైనే ఫోకస్ పెడుతున్నారు మేకర్లు. ఎందుకంటే క్యాస్టింగ్ కారణంగా బజ్ ఫాస్టుగా వచ్చేస్తోంది. చివరకు అది సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అయినా కూడా.. క్యాస్టింగ్ అనేది చాలా ముఖ్యమైన అంశం అయిపోయింది. అసలు కబాలి సినిమాలో రజనీ తప్పించి మిగతావారికి మినిమం ఇమేజ్ కూడా లేకపోవడంతోనే ఫ్లాపు టాక్ ఫాస్టుగా వచ్చిందనేది ఒక వాదన. అందుకే ఇప్పుడు కాలా విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నారు.

తెలుగులో కృష్ణ వంశీ తీసిన అంతఃపురంలో ప్రకాష్ రాజ్ చేసిన తండ్రి పాత్రను హిందిలో శక్తి అనే రీమేక్ లో నానా పాటేకర్ నటించారు. ఆ విధంగా మనోళ్ళకు ఈయనతో పరిచయం. అంతే కాకుండా అబ్ తక్ చప్పన్ నుండి మొన్నటి రాజనీతి వరకు.. హింది మరాఠీ లో గొప్ప నటుడుగా పేరు సంపాదించారు నానా. ఇతను సినిమాలుతో పాటు మరాఠీ నాటకాలలో కూడా నటిస్తారు. ఇప్పుడు సౌత్ సూపర్ స్టార్ సినిమాలో విలన్ గా చేసేందుకు రెడీ అయిపోతున్నాడు. నానా పాటేకర్ కాలా సినిమాలో రజినీకాంత్ కు ప్రతినాయకుడు గా కనిపించి మెప్పిస్తారట. ఒక నీతి లేని రాజీకియ నాయకుడు గా కనిపిస్తూ.. రజినీకాంత్ పాత్రకు ధీటుగా ఉంటారని తెలుస్తోంది. ముంబాయ్ లో ఉండే తమిళ్ జనాలు కోసం నానా రాజకీయపార్టీ తో గొడవ పెట్టుకుంటాడట రజనీ.. అక్కడే వీరి ఫైట్ స్టార్ట్ అవుతుంది. నానా షూటింగ్ షెడ్యూల్ ఇంకా మొదలుకాలేదులే.

ఈ సినిమాలో తమిళ్ నటుడు రజిని అల్లుడు ధనుష్ కూడా నటిస్తున్నాడు. పా రంజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు నిర్మాత నటుడు ధనుష్. కబాలి సినిమాను కూడా డైరెక్ట్ చేసింది ఈ పా రంజిత్ నే. కాలా సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నటి హుమా ఖురేషి నటిస్తోంది.

,  ,  ,  ,  ,  ,