Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-May-2016 15:16:24
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ గురించి.. అన్ని హీరోల ఫ్యాన్లూ చర్చించుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో.. కొంతమంది ఫ్యాన్స్ చాలా ఉద్రిక్తంగా మారిపోతున్నారనే విషయం మనకు తెలియంది కాదు. సోషల్ మీడియాల్లో బూతులు తిట్టడం నుండి.. ఏకంగా లైవ్ లో ఒక ఫంక్షన్ కు వచ్చి అక్కడ హీరోలను ఇబ్బంది పెట్టడం వరకు అన్నీ చేస్తున్నారు. దాదాపు అన్ని స్టార్ల ఫ్యాన్లు ఇదే బాపత్తు.

అయితే ఆ మధ్యన కళ్యాణ్ రామ్ ఆడియో ఫంక్షన్ లో ''జై బాలయ్య'' అంటూ అరుస్తుండటంతో.. కొందరు హార్డు కోర్ నందమూరి ఫ్యాన్స్ కూడా పవన్ ఫ్యాన్స్ లా తయారయ్యారనే కామెంట్లు విన్నాం. కాని.. ఆ ఫంక్షన్ వరకు ఏమో కాని.. ఇతరులకు రెస్పెక్ట్ ఇవ్వడంలో నందమూరి ఫ్యాన్స్ ఒక స్టెప్ ముందే ఉన్నారని అంటున్నారు ఇతర హీరోల ఫ్యాన్స్. మొన్నటికి మొన్న బాలయ్య 100వ సినిమా లాంచ్ కు.. మెగాస్టార్ చిరంజీవిని విశిష్ట అతిథిగా పిలిచారు. అసలు బాలయ్య చిరంజీవిని పిలవడం అనేదే అభిమానులకు షాకిచ్చి ఉండాలి. కాని చిరంజీవి స్టేజ్ మీదకు వచ్చినప్పుడు.. నందమూరి ఫ్యాన్స్ ఇచ్చిన రియాక్షన్ కేక.

ముందు చిరంజీవి మైక్ తీసుకున్న వెంటనే.. ఏదో కాస్త అలజడిరేగింది. అది గోల కాదు. కేవలం అలజడి అంతే. తరువాత ఆయన మాట్లాడుతూ.. గౌతమీపుత్రి శాతకర్ణి సబ్జెక్టును ఎన్నుకునే బాలయ్య సక్సెస్ కొట్టాడు అనగానే.. నందమూరి ఫ్యాన్స్ క్లాప్స్ కొట్టారు. ఆ తరువాత తన స్పీచ్ లో భాగంగా.. ''నందమూరి అభిమానులకు ఈ సినిమా నచ్చుతందని ఆశిస్తున్నా'' అనగానే.. అభిమానులు ఉర్రూతలూగిపోయారు. అసలు నందమూరి క్లాన్ కు ప్రథమ వైరి అనుకున్న చిరంజీవి నోట.. 'నందమూరి' అనే మాటరాగానే.. (పైగా ఆయన పొలిటికల్ గా కూడా యాంటీ టిడిపి).. ఫ్యాన్స్ వీలలు వేశారు. వెంటనే మళ్లీ సైలెంట్ అయిపోయారు. మామూలుగా చిరంజీవిని మెగా ఫంక్షన్లలోనే అరుపులతో స్పీచ్ చెప్పనీయకుండా డిస్ర్టబ్ చేస్తుంటే.. ఇక్కడ మాత్రం ఒక రేంజులో ఉంది.

తన ఫ్యాన్స్ ఒకవేళ ఏమన్నా అనుకుంటారేమో అని ఆలోచించకుండా.. 100వ సినిమా కాబట్టి.. అది ఐకానిక్ సినిమా కాబట్టి.. మోడ్రన్ తెలుగు సినిమా ఇండస్ర్టీకి ఒక మూల స్తంభం వంటి చిరంజీవిని అతిథిగా పిలిచిన బాలయ్య అభిమానం.. అక్కడకొచ్చిన నందమూరి అభిమానుల సంస్కారం.. అద్భుతహా!! కాదంటారా?

,  ,  ,