Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Jul-2017 11:26:09
facebook Twitter Googleplus
Photo

ఈ పేరు ఇప్పుడు విన్నప్పుడు అందరికీ వీడు మనవాడే అనే భావన కలుగుతుంది. అందుకే నాని లోకల్ స్టార్ అయ్యాడు నేచురల్ గా స్టార్ లా ఎదిగాడు.ఇప్పుడు నాని నటించిన కొత్త సినిమా నిన్ను కోరి ఈ వారం విడుదలకాబోతుంది. ఈ సినిమా పై తన అభిప్రాయాన్ని ప్రేక్షకులుకు ముందు ఇలా ఉంచాడు.

ఇది మీ అందరూ ఊహించినట్లే ప్రేమ కథే. కానీ ఇందులో ప్రేమ మాత్రమే లేదు మన జీవితాలలో మనం అర్ధం చేసుకోవాలిసిన ప్రేమ ఉంది. ఎందుకోగాని మనం మన జీవిత కథలును మనం చూడటానికి అంతగా ఇష్టపడం. అందుకనే మనం కామిడీ సినిమాలు ఎక్కువగా చూడటానికి ఇష్టపడతాం. కొంచెం మెలోడ్రామా ఉన్న ఆ సీన్ ఎప్పుడు అయిపోతుందా అని ఎదురుచూస్తాం లేకపోతే ఆ ఎమోషన్ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నాకు ఈ సినిమా కథ మొదటిసారి విన్నప్పుడు చాలా ఏడుపు వచ్చింది. నేను చేసిన పాత్రలో బాధ ఉంది కొంచెం ప్రేమ ఉంది కొంచం మన జీవితం కూడా ఉంది అందుకే ఈ సినిమా నాకు నచ్చినంతగా మీకు నచ్చాలి అని కోరుకుంటున్నాను అని చెప్పాడు. ఈ కథ మన కథలానే ఉంటుంది ఇలాంటి కథలు మీరు మళ్ళీ మళ్ళీ చూడాలి అనుకోవాలి అని ఆశిస్తూ సెలవు తీసుకున్నాడు.

ఈ సినిమాను కొత్త డైరెక్టర్ శివ నిర్వాణ డైరెక్ట్ చేశాడు. నివేథ థామస్ - ఆది పినిశెట్టి నిన్ను కోరి సినిమాలో మరో ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాతో నాని కెరియర్ మరో మెట్టు ఎక్కబోతుంది అని ఇప్పటికే పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

,  ,  ,  ,  ,