Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Nov-2016 11:27:05
facebook Twitter Googleplus
Photo

ఈ యేడాది నాని సినిమాలతో పరిచయమైన అందమైన హీరోయిన్ లలో నివేదా థామస్ ఒకరు. `జంటిల్ మన్`తో తెలుగు తెరపైకొచ్చిన ఈమె కేవలం అందంతోనే కాదు - నటనతోనూ ఆకట్టుకుంది. దాంతో అవకాశాలు వరుస కట్టాయి. కానీ ఆమె మాత్రం తొందరపడకుండా ఆచితూచి నిర్ణయం తీసుకుంది. మళ్లీ నానితోనే కలిసి నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శివశంకర్ లాలమ్ అనే ఓ కొత్త దర్శకుడు తీయనున్న సినిమాలో నాని సరసన నివేదా నటించబోతోంది. ఇందులో ఆది పినిశెట్టి విలన్ గా నటించబోతున్నాడట.

కోన వెంకట్ - డి.వి.వి.దానయ్య కలిసి నిర్మించబోతున్నారు. ఎక్కువ పార్ట్ సినిమా అమెరికాలోనే తెరకెక్కించబోతున్నారట. నాని - నివేదా జంటగా మళ్లీ నటించబోతున్నారనే విషయం చాలా రోజులక్రితమే బయటికొచ్చింది. కానీ నివేదా మాత్రం ఆ విషయాన్ని రహస్యంగా ఉంచింది. నిర్మాతలు సినిమా పనుల్ని షురూ చేయడంతో నివేదా కూడా ఎస్ అని చెప్పేసింది. తెలుగులో మళ్లీ షురూ చేద్దాం... అంటూ నానితో నటిస్తున్న విషయాన్ని నివేదా బయటపెట్టింది. ఆమె చరణ్ తోనూ కలిసి నటించబోతోందనే వార్తలొచ్చాయి. మరి అందులో నిజమెంతన్నది మాత్రం కొన్ని రోజులు ఆగితే తప్ప తెలిసే అవకాశం లేదు. ధృవ సినిమా పూర్తయ్యాకే చరణ్ కొత్త సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడవుతాయి.

,  ,  ,  ,  ,