Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Oct-2016 10:56:24
facebook Twitter Googleplus
Photo

మలయాళీ భామ నివేదా థామస్ జెంటిల్మన్ మూవీతో టాలీవుడ్ అరంగేట్రం చేసింది. ఆ సినిమాలో నివేద యాక్టింగ్ కి బోలెడన్ని ప్రశంసలతో పాటు విపరీతమైన గుర్తింపు కూడా వచ్చింది. నేచురల్ స్టార్ నాని నటించిన సినిమాలో హీరోయిన్ కి ఇలాంటి గుర్తింపు రావడం చాలా అరుదుగా జరిగే విషయం. మరోవైపు నాని కూడా ఎప్పిటికప్పుడు కొత్త హీరోయిన్లను తీసుకొస్తూ ఉంటాడు.

అయితే జెంటిల్మన్ లో చేసిన కేథరిన్ పాత్ర తర్వాత నివేదా థామస్ కు బోలెడన్ని ఆఫర్స్ వచ్చేస్తాయని.. తెలుగులో వరుసగా సినిమాలు చేసి సెటిల్ అయిపోతుందని అంతా అనుకుంటే.. ఈమె మాత్రం బాగా సెలెక్టివ్ గా ఉంటూ వేరే సినిమాని ఒప్పుకోలేదు. మళ్లీ ఇప్పుడు నాని హీరోగానే రూపొందనున్న ఓ చిత్రానికి నివేదాని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో హీరో నాని 'నేను లోకల్' చేస్తుండగా.. ఆ తర్వాత కొత్త దర్శకుడు శంకర్ లాలం అనే కొత్త దర్శకుడితో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది.

డీవీవీ దానయ్య నిర్మించనున్న ఈ చిత్రాన్ని.. నేను లోకల్ రిలీజ్ అయ్యే సమయానికే.. అంటే డిసెంబర్ లో షూటింగ్ ప్రారంభించనున్నారట. ఈ చిత్రంలో నివేదా థామస్ ను హీరోయిన్ గా అడిగారని.. ఆమెతో అగ్రిమెంట్ వ్యవహారాలు నడుస్తున్నాయని తెలుస్తోంది.

,  ,  ,  ,  ,