Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Jun-2016 10:42:03
facebook Twitter Googleplus
Photo

తెలుగు ప్రేక్షకులందు అమెరికన్ తెలుగు ప్రేక్షకులు వేరు. వాళ్ల అభిరుచి కొంచెం భిన్నంగా ఉంటుంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లనే ఎక్కువగా ఆదరిస్తారు అక్కడ. రొటీన్ కమర్షియల్ సినిమాలకు.. ముఖ్యంగా వయొలెన్స్ ఎక్కువున్న మాస్ సినిమాలకు అక్కడ పెద్దగా ఆదరణ దొరకదు. అందుకే రామ్ చరణ్.. బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సినిమాలకు అక్కడ పెద్దగా మార్కెట్ రాలేదు. ఐతే నాని లాంటి మీడియం రేంజి హీరో అక్కడ పెద్ద స్టార్ అయిపోయాడు. అతడి ప్రతి సినిమాకూ అమెరికాలో అదిరిపోయే వసూళ్లు వచ్చాయి.

ఇప్పటికే అతడికి రెండు మిలియన్ డాలర్ సినిమాలుండటం విశేషం. ఫస్ట్ మిలియన్ మూవీ ?ఈగ? తాలూకు క్రెడిట్ దర్శకుడు రాజమౌళికే దక్కుతుంది కాబట్టి పక్కనబెట్టేద్దాం. కానీ ?భలే భలే మగాడివోయ్? దాదాపు 1.5 మిలియన్ డాలర్లు వసూలు చేసిందంటే అందులో మేజర్ క్రెడిట్ నానికే దక్కుతుంది. దీని తర్వాత ?కృష్ణగాడి వీర ప్రేమగాథ? 8 లక్షల డాలర్లు వసూలు చేసి నాని స్టామినాను మరోసారి రుజువు చేసింది. లేటెస్టుగా ?జెంటిల్ మన్? కూడా అమెరికాలో అదరగొడుతోంది. ఫస్ట్ వీకెండ్లోనే ఈ సినిమా హాఫ్ మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టడం విశేషం. ఇదే ఊపు రెండో వారాంతంలోనూ కంటిన్యూ అయితే.. ఈ సినిమా మిలియన్ క్లబ్బును టచ్ చేయడం ఖాయం. ?భలే భలే..? కంటే ముందు వచ్చిన నాని సినిమా ?ఎవడే సుబ్రమణ్యం? కూడా అమెరికాలో బాగానే ఆడింది. మొత్తానికి వరుసగా నాలుగు సక్సెస్లతో అమెరికాలో బ్యాంకబుల్ తెలుగు హీరో అయిపోయాడు నాని. పెద్ద హీరోల సినిమాలతో ఎదురు దెబ్బలు తింటున్న బయ్యర్లకు నాని నమ్మదగ్గ హీరోగా మారాడు. పెట్టుబడి భారీగా పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు కాబట్టి.. అతడి సినిమా అంటే కళ్లు మూసుకుని కొనేయొచ్చన్న భరోసాతో ఉన్నారు బయ్యర్లు.

,  ,  ,  ,  ,  ,