Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-May-2016 13:05:05
facebook Twitter Googleplus
Photo

అష్టాచెమ్మా తర్వాత హీరో నాని - దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ కాంబినేషన్ లో వస్తున్న మూవీ జెంటిల్మన్. కాంబినేషన్ తోనే ఆసక్తి కలిగించిన ఈ సినిమా.. ఫస్ట్ లుక్ నుంచి మరింతగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. రీసెంట్ గా ఆడియో ఫంక్షన్ సందర్భంగా.. ఈ చిత్రానికి థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు.

సాధారణంగా ఇచ్చే థియేట్రికల్ ట్రైలర్లతో పోల్చితే.. జెంటిల్మన్ ను కొంచెం క్రిస్ప్ గానే కట్ చేశారు. ఎక్కువ డ్యురేషన్ లేకుండా.. కాన్సెప్ట్ ని చెప్పీ చెప్పనట్లుగా రివీల్ చేశారు. మొదట లవ్ స్టోరీతో మొదలు పెట్టి తర్వాత వయొలెన్స్ వైపు టర్న్ తీసుకున్న విధానం అదుర్స్ అనిపిస్తుంది. స్టార్టింగ్ లో హీరోయిన్ ని రెండు చేతులతో పట్టుకుని 'అలా సడెన్ గా అడిగితే ఏం చెబ్తాం' అంటూ నాని అడిగిన తీరు చూస్తే.. ఇంతగా నాని తప్ప వేరే ఎవరూ ఈ డైలాగ్ చెప్పలేరని అనిపిస్తుంది. ఆ తర్వాత రజినీ స్టైల్ ని పారడీ చేయడం కేక అంతే.

'వయొలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడొస్తాయో కదా' అంటూ నాని డైలాగ్ తో ఫైటింగ్ ఎపిసోడ్ ని మొదలుపెట్టి.. అక్కడినుంచి అంతా క్రైమ్ కహానీ రేంజ్ లో చూపించారు. రెండు షేడ్స్ ఉన్న రోల్ ని నాని అద్భుతంగా పండించాడు. హీరోయిన్ ని కాపాడుతున్నాడో.. లేక తనే చంపేందుకు ట్రై చేస్తున్నాడో అనే క్యూరియాసిటీని కలిగించడంలో మాత్రం డైరెక్టర్ ఇంద్రగంటి సక్సెస్ అయ్యాడు. తక్కువ ఫ్రేమ్స్ లోనే కనిపించిన శ్రీనివాస్ అవసరాల.. మాట్లాడిన తక్కువ డైలాగ్స్ తోనే ఆకట్టుకున్నాడు. మొత్తం మీద జెంటిల్మన్ ట్రైలర్ ఆడియన్స్ లో ఆసక్తిని బాగానే జనరేట్ చేసింది. మరి ఆ సీక్రెట్ ఏంటో తెలియాలంటే మాత్రం జూన్ 17న రిలీజ్ వరకూ ఆగాల్సిదే.

,  ,  ,  ,  ,