Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Feb-2017 11:28:30
facebook Twitter Googleplus
Photo

సరిగ్గా ఓ సినిమా రిలీజ్ అవడానికి మూడు రోజుల ముందు.. ఓ హీరో విదేశాలకు వెళ్లిపోవడం అంటే.. నిజంగా షాక్ అనే చెప్పాలి. ప్రస్తుతం హీరో నాని పరిస్థితి అలాగే ఉంది. ఫిబ్రవరి 3న నేను లోకల్ రిలీజ్ కానుండగా.. ఇప్పటివరకూ ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొన్న నాని.. ఇప్పుడు అమెరికా చెక్కేశాడు.

అమెరికా బయల్దేరాను. 2వ తేదీ నుంచి నా కొత్త సినిమా ప్రారంభం కానుంది. నేను లోకల్ ప్రీమియర్స్ కూడా ఆ రోజే. చాలా ఎగ్జైటింగ్ గా ఉంది.. గెట్ సెట్ గో' అంటూ ఓ ట్వీట్ పెట్టి మరీ జంప్ అయ్యాడు నాని. నేను లోకల్ సినిమా రిలీజ్ ఉన్నా.. దానికి ప్రమోషన్స్ చేయాల్సి ఉన్నా.. ఇలా అమెరికా వెళ్లాల్సి రావడానికి నాని చెప్పిన కారణం వాస్తవమే. రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ లేకపోవడంతో.. ముందుగానే ఈ షెడ్యూల్ ఫైనల్ అయింది. నిజానికి తాను షూటింగ్ డేట్స్ మార్చుకుందామని ప్రయత్నించినట్లు చెప్పాడు నేచురల్ స్టార్.

అయితే.. మొత్తం 35 మంది టీంకి కాల్షీట్స్.. డేట్స్.. టికెట్స్ అడ్జస్ట్ చేయాల్సి రావడంతో.. ఇక పబ్లిసిటీ కంటే షూటింగ్ కే మొగ్గాడు నాని. మరోవైపు అమెరికాలో నేను లోకల్ ప్రీమియర్స్ కి అటెండ్ కానుండడం మాత్రమే.. ఈ చిత్రానికి నాని చేసే పబ్లిసిటీ. గతంలో భలేభలే మగాడివోయ్ తో మిలియన్ డాలర్ క్లబ్ ను ఈజీగా దాటేసిన నాని.. ఆ తర్వాత మాత్రం ఒక్క సినిమాని కూడా అక్కడికి తీసుకెళ్లలేకపోయాడు. ఇప్పుడు నేను.. లోకల్ తో.. మరోసారి ఆ ఫీట్ సాధిస్తాడనే అంచనాలున్నాయి.

,  ,  ,  ,  ,