Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Nov-2016 10:44:28
facebook Twitter Googleplus
Photo

నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ మజ్ను. ఈ ఏడాదిలో నాని కొట్టిన మూడో హిట్ ఇది. కృష్ణగాడివీర ప్రేమగాధ సక్సెస్ తో స్టార్ట్ చేసి.. జెంటిల్మెన్ తో పేస్ కంటిన్యూ చేసిన నాని.. మజ్నూతో 2017లోనే హ్యాట్రిక్ కంప్లీట్ చేశాడు. దసరా హాలిడేస్ కు ముందు రావడం.. పండుగ రోజుల్లో కూడా సత్తా చాటేందుకు అవకాశం ఇచ్చింది. నానికి జోడీగా అను ఇమాన్యుయేల్. ప్రియాశ్రీలు నటించగా.. విరించి వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీకి తెలుగు ప్రేక్షకులు విజయాన్నే అందించారు.

నాని కెరీర్ లో బెస్ట్ అనిపించుకోకపోయినా.. మొత్తంగా మజ్ను కలెక్షన్స్ సంతృప్తికరంగానే ఉండడం విశేషం. నైజాం నుంచి 4.70 కోట్లు రాబట్టగా.. సీడెడ్ 1.55 కోట్లు.. వైజాగ్ 1.60 కోట్లు.. ఈస్ట్ 1.13 కోట్లు.. వెస్ట్ 88 లక్షలు.. కృష్ణా 81 లక్షలు.. గుంటూరు 95 లక్షలు.. నెల్లూరు 40 లక్షలు చొప్పున వసూళ్లు దక్కాయి. టోటల్ గా తెలుగు రాష్ట్రాల నుంచి 12.02 కోట్ల కలెక్షన్స్ రాగా.. యూఎస్ఏ నుంచి 1.53 కోట్లు.. కర్నాటక నుంచి 1.20 కోట్ల రూపాయలు.. ఇతర ప్రాంతాల నుంచి 55 లక్షలు వసూలయ్యాయి.

మొత్తం 15.3 కోట్ల షేర్ ను రాబట్టి బాక్సాఫీస్ దగ్గర మినిమం గ్యారంటీ హీరోకు పర్యాయపదంగా మారిపోయాడు. నాని

,  ,  ,  ,  ,  ,