Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Sep-2016 11:39:25
facebook Twitter Googleplus
Photo

నేచురల్ స్టార్ నాని అప్పుడే ఈ సంవత్సరం 3వ సినిమాను కూడా దించేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు సినిమాలు అందించిన నాని.. ఇప్పుడు 'మజ్ను' అంటూ వచ్చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం ఈ సినిమా కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ఎలా ఉందో చూద్దాం పదండి.

అన్ని విధాలుగా సినిమాను పరిశీలించిన బోర్డు వారు.. సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ జారీ చేశారట. సినిమాలో కొత్త హీరోయిన్లు అను ఇమ్మానుయేల్ - ప్రియాశ్రీ పండించిన గ్లామర్.. అలాగే కొన్ని కామెడీ సీన్లు.. టోటల్ గా లవ్ సబ్జెక్టు కావడంతో.. ఈ యూత్ ఫుల్ ఎంటర్టయినర్ కు యు/ఎ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎలాగో సెన్సార్ పూర్తయిపోయింది కాబట్టి.. చక్కగా రెండు వారాలపాటు బీభత్సమైన ప్రమోషన్ చేసుకుని.. సెప్టెంబరు 23 వ తేదీన మజ్ను ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఉయ్యాల జంపాల ఫేం విరించి వర్మ డైరక్షన్లో రూపొందించిన మజ్ఞూ సినిమాకు.. గోపీసుందర్ సంగీతం అందించారు. ఇకపోతే సినిమాలో కామెడీ ఫ్యాక్టర్ అదిరిపోతుందని టాక్.

,  ,  ,  ,  ,  ,