Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Apr-2017 13:44:13
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్ రీసెంట్ మూవీ కాటమరాయుడు.. తమిళ్ మూవీ వీరమ్ కు రీమేక్ అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న పవర్ స్టార్.. ఆ తర్వాత తమిళ దర్శకుడు నీసన్ తో ఓ మూవీ చేయాల్సి ఉంది. ఏఎం రత్నం నిర్మాణంలో రూపొందే ఈ చిత్రం.. కోలీవుడ్ మూవీ వేదాళంకు రీమేక్ అనే విషయాన్ని మేకర్స్ చెప్పేశారు.

వీటితో పాటు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేస్తాడని టాక్ వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ సినిమా కూడా రీమేక్ అన్నారు. విజయ్ నటించిన తమిళ చిత్రం తెరి(తెలుగులో పోలీసోడుగా రిలీజ్ అయింది)కి రీమేక్ అనుకున్నారంతా. అయితే.. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమా.. ఓ మూవీకి రీమేక్ కాదని.. పవన్ కోసమే రూపొందించిన ఒరిజినల్ స్టోరీ అని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మంగా రూపొందిచనున్న ఈ చిత్రం.. స్ట్రెయిట్ సినిమానే అని చెబుతున్నారు సినీ జనాలు.

,  ,  ,  ,  ,