Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Nov-2017 09:49:48
facebook Twitter Googleplus
Photo

ఎంసీఏ. మిడిల్ క్లాస్ అబ్బాయిలు అంటూ కొత్త అర్ధం చెప్పి మరీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు వేణు శ్రీరాం. డిసెంబర్ 22న విడుదల కానున్న ఈ చిత్రం.. దిల్ రాజు బ్యానర్ పై రూపొందుతోంది.

మరో నెల రోజులు మాత్రమే రిలీజ్ కి సమయం ఉండగా.. ఇప్పటికే ఎంసీఏ చిత్రానికి ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. వచ్చే నెల రెండో వారంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా.. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ఒక్కోపాట చొప్పున విడుదల చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం.. ఎంసీఏ మూవీని మరో మెట్టు ఎక్కించడం ఖాయం అనే సంగతి.. ఫస్ట్ లిరికల్ సాంగ్ తోనే తేలిపోయింది. టైటిల్ సాంగ్ ను తాజాగా విడుదల చేయగా 'వీధి చివర ఉంటాదో టీ కొట్టు.. ఆడ మేం తాగే టీ ఏమో వన్ బై టు‘ అంటూ సాగే ఈ పాటకు.. సాహిత్యం నుంచి ట్యూన్.. సింగర్ వాయిస్ తో అన్నీ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి.

ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేసేసి.. మూడో హ్యాట్రిక్ కూడా మొదలుపెట్టేసిన నాని కెరీర్ లో ఎంసీఏ కూడా ప్రామిసింగ్ గా కనిపిస్తోంది.

,  ,  ,  ,  ,  ,