Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Oct-2016 16:50:05
facebook Twitter Googleplus
Photo

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా వచ్చేస్తోంది. దసరా కానుకగా ?ప్రేమమ్? థియేటర్లలో సందడి చేయబోతోంది. పోటీగా నాలుగు సినిమాలు వస్తున్నా సరే.. అంచనాలు భారీగా ఉన్నది.. భారీగా విడుదలవుతున్నది ?ప్రేమమ్? సినిమా మీదే. దసరాకు ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ ఈ చిత్రమే. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ ?ప్రేమమ్? భారీగా విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని అమెరికాలో ఏకంగా 111 స్క్రీన్లలో విడుదలవుతుండటం విశేషం. అమెరికాలో భారీ చిత్రాల్ని డిస్ట్రిబ్యూట్ చేసే ?బ్లూ స్కై? ప్రేమమ్ సినిమాను రిలీజ్ చేస్తోంది. దసరాకు అంత పోటీ ఉన్నప్పటికీ 111 స్క్రీన్లలో ?ప్రేమమ్?ను రిలీజ్ చేయడం విశేషమే.

యుఎస్ తెలుగు ఆడియన్స్ క్లాస్ సినిమాలకు.. రొమాంటిక్ లవ్ స్టోరీలకు పట్టం కడతారు. కొంచెం ఎంటర్టైన్మెంట్ మిక్స్ అయిన రొమాంటిక్ ప్రేమకథలంటే వారికి బాగా ఇష్టం. ?ప్రేమమ్? సరిగ్గా ఇలాంటి సినిమానే. కాబట్టి అక్కడ ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రిమియర్లు కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నారు. సినిమాపై పాజిటివ్ బజ్ ఉండటంతో ఇది సోలో హీరోగా నాగచైతన్య కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ?కార్తికేయ? లాంటి వైవిధ్యమైన హిట్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చైతూ సరసన శ్రుతి హాసన్.. అనుపమ పరమేశ్వరన్.. మడోన్నా సెబాస్టియన్ కథానాయికలుగా నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్ మీద సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 7న ?ప్రేమమ్? ప్రేక్షకుల ముందుకొస్తుంది.

,  ,  ,  ,  ,