Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Oct-2016 10:38:18
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం లాంటి భారీ సినిమాను నిర్మించాడు పొట్లూరి వరప్రసాద్. ఐతే భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా భారీ ఫ్లాప్ అయింది. ఇది పీవీపీకి కోలుకోలేని దెబ్బే. ఐతే ఆయన్ని ఆదుకోవడానికి మరో సినిమా చేస్తానని హామీ ఇచ్చాడు మహేష్. వంశీ పైడిపల్లి చెప్పిన ఒక లైన్కు మహేష్ ఓకే చెప్పేయడంతో ప్రిన్స్ పుట్టిన రోజు నాడు ఈ సినిమాను అనౌన్స్ చేసేశాడు పీవీపీ. ఐతే స్క్రిప్టు ఇంకా పక్కాగా రెడీ కాకపోవడం.. మరోవైపు మురుగదాస్ సినిమా తర్వాత కొరటాల ప్రాజెక్టుకు మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వంశీ పైడిపల్లితో సినిమాపై సందేహాలు నెలకొన్నాయి. ఐతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు పీవీపీ.

మహేష్-వంశీ సినిమా కచ్చితంగా ఉందని.. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని.. వచ్చే ఏడాది జూన్లో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుందని చెప్పాడు పీవీపీ. అంటే కొరటాల సినిమా పూర్తయిన వెంటనే మహేష్.. వంశీ సినిమాలో ఇన్వాల్వ్ అవుతాడన్నమాట. ఇక తన ప్రొడక్షన్లో రాబోయే మిగతా సినిమాల గురించి కూడా పీవీపీ స్పష్టత ఇచ్చాడు. ??రానాతో చేస్తున్న ఘాజి షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న రిలీజ్ చేస్తాం. ఇండియా పాకిస్థాన్ మధ్య మనకు తెలియని యుద్ధం విశాఖపట్నంలో జరిగింది. దాని నేపథ్యంలోనే ఈ కథ సాగుతుంది. నాగార్జునతో ఓంకార్ డైరెక్షన్లో రాజుగారి గది-2 చేస్తున్నాం. ఊపిరి తర్వాత మరోసారి నాగ్తో పని చేయడం హ్యాపీ. ఈ సినిమా ఈ ఏడాది ఆఖర్లో మొదలవుతుంది. వేసవికి రిలీజ్ చేస్తాం?? అని పీవీపీ చెప్పాడు.

,  ,  ,  ,  ,  ,