Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Jun-2017 12:02:38
facebook Twitter Googleplus
Photo

ఈ మధ్య నాని తన రేంజు పెంచుకుంటూ సినిమా సక్సెస్ రేటు కూడా పెంచాడు. గత ఆరు సినిమాలు అన్నీ బాగానే ఆడాయ్. ఇక ఇప్పుడు వస్తున్న నిన్నుకోరి కూడా పోస్టర్ విడుదలైనప్పుడే తెలిసిపోయింది మరో ప్రేమ కథతో మనందరిని అలరించడానికి వస్తున్నాడని. నిన్ననే విడుదలైన మొదట పాట ‘అడిగా అడిగా’ తో ఇది ఖచ్చితంగా ప్రేమ కథ చిత్రమే అని తేలిపోయింది. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి.

అడిగా అడిగా సాంగ్ ను ప్రేమికులు అందరూ వాళ్ళ ప్రేమ కోసం పదేపదే పాడుకునేటట్లు చాలా సులువైన పదాలుతో చక్కటి రాగంతో మ్యూజిక్ ఇచ్చారు గోపిసుందర్. ఇప్పుడు ఆ చిత్ర యూనిట్ ఒక కొత్తరకం కాంటెస్ట్ పెట్టింది. అడిగా అడిగా పాటకు ఒక చక్కని కవర్ డిజైన్ చేయండి అని చెప్పారు. కవర్ అంటే గ్రాఫిక్ డిజైనింగ్ కాదండోయ్.. ఏదన్నా సింగిల్ వాయిద్యంతో మ్యూజిక్ వాయిస్తూ.. ఈ పాటను సోలోగా పాడటాన్ని కవర్ వర్షన్ అంటారు. ఎవరైతే అలా బెస్ట్ కవర్ వర్షన్ తో వస్తారో వాళ్ళకి ఆడియో ఫంక్షన్లో నాని తో కలిసి లైవ్ లో పాల్గొనే అవకాశం దక్కుతుంది అని చెప్పారు.

శివ నిర్వాణ అనే కొత్త డైరెక్టర్ నిన్నుకోరి సినిమాను డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్గా నివేధ థామస్ చేస్తుంది. తమిళ్ హీరో ఆది పినిశెట్టి ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.

,  ,  ,  ,  ,  ,