Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Jun-2016 11:15:38
facebook Twitter Googleplus
Photo

వరుస హిట్స్‌తో జోరు మీదున్న నాని, అదే ఉత్సాహంతో తన కొత్త సినిమా ?జెంటిల్‌మన్‌?ను విడుదలకు సిద్ధం చేసిన విషయం తెలిసిందే. మరో పది రోజుల్లో ఈ సినిమా విడుదల అవుతుండగా, ఓ పక్క ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటూనే మరోపక్క ఇంకో సినిమాను అప్పుడే సెట్స్‌పైకి తీసుకెళ్ళిపోయారు. ?ఉయ్యాల జంపాల? సినిమాతో పరిచయమై మెప్పించిన విరించి వర్మతో నాని ఓ రొమాంటిక్ కామెడీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మెదక్‌లో జరుగుతోంది.
నాని స్టైల్ కామెడీతో మంచి రొమాంటిక్ కామెడీగా ఈ సినిమా తెరక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో విడుదల కానున్న ఈ సినిమాను జెమిని కిరణ్ నిర్మిస్తున్నారు. ఇక ?జెంటిల్‌మన్? సినిమా విషయానికి వస్తే, అష్టా చమ్మా తర్వాత తనను పరిచయం చేసిన దర్శకుడితో మళ్ళీ ఇన్నాళ్ళకు సినిమా చేసిన నాని, ఈ సినిమాలో ఓ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నారు. జూన్ 17న జెంటిల్‍మన్ విడుదల కానుంది.

,  ,  ,  ,  ,  ,