Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Apr-2016 12:26:00
facebook Twitter Googleplus
Photo

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ?నాన్నకు ప్రేమతో? సినిమా ఆయనకు నటుడిగానే కాక, బాక్సాఫీస్ పర్ఫామెన్స్ పరంగానూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. తన ఇమేజ్‌కు పూర్తి భిన్నమైన పాత్రలో కనిపిస్తూ, ఎన్టీఆర్ చేసిన ఈ ప్రయోగం నేటితో వంద రోజులు పూర్తి చేసుకుంటోంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా ఎన్టీఆర్‌కు మొట్టమొదటి 50 కోట్ల సినిమాగా నిలవడమే కాక, యూఎస్‍లో 2 మిలియన్ సాధించిన మూడో తెలుగు సినిమాగా నిలిచి ప్రత్యేకత చాటుకుంది.
ఇక నేడు ఆదోనిలోని సత్యం థియేటర్లో ?నాన్నకు ప్రేమతో? వంద రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో ఎన్టీఆర్ అభిమానులు వంద రోజుల వేడుకను నిర్వహించేందుకు ఇప్పటికే ప్లాన్ చేసుకున్నారు. మ్యాజిక్ స్క్రీన్‌ప్లేతో మాయ చేసే సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‍గా నటించారు. ఎన్టీఆర్ కెరీర్‌లో ఓ క్లాస్ సినిమాగా నిలిచిన నాన్నకు ప్రేమతోను బీవీఎస్‌ఎన్ ప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

,  ,  ,  ,  ,  ,